టాప్ న్యూస్ @1PM

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ప్రశ్నల వర్షం కురిపించారు. విజయవాడ నడిబొడ్డులో దుకాణం తెరిచి... అక్కడి నుంచి టన్నుల టన్నుల హెరాయిన్ ను ఎక్కడకు పంపిస్తున్నారని ప్రశ్నించారు. ఈ మత్తు పదార్థాలను ఎక్కడి నుంచి కొంటున్నారని అడిగారు. ఎలాంటి విచారణ జరపకుండానే హెరాయిన్ విషయంలో క్లీన్ చిట్ ఎలా ఇస్తారని మండిపడ్డారు. 
---
అక్టోబర్ మాసానికి సంబంధించిన 2.31 లక్షలు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. కేవలం 2.30 గంటల సమయంలోనే 2.31 లక్షలు టిక్కెట్లను భక్తులు కొనుగోలు చేశారు. టిక్కెట్ల బుకింగ్ సమయంలో జియో మార్ట్‌కు రీడైరెక్ట్ అవుతుడటంతో దానిని పరిష్కరించేందుకు  టీటీడీ చర్యలు తీసుకుంటుంది. 
---
వైసీపీ డ్రగ్స్ వ్యాపారం వల్ల ఏపీ అంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు. డీఆర్‌ఐ అధికారులు ఆంధ్ర బోర్డర్స్ అంటే జాగ్రత్తగా వుండాలి అని పక్క రాష్ట్రాలను హెచ్చరిస్తున్నారని తెలిపారు. డీజీపీ వైసీపీ తప్పులను కప్పి పుచ్చుతున్నడు 9 వేల కోట్లు హెరాయిన్ దొరికితే ఏమీలేదు అని డీజీపీ ఎలా చెప్పుతారని ప్రశ్నించారు. 
-------
ఏపీలో ఎంపీపీ ఎన్నికల సందర్భంగా అధికార వైసీపీ నేతల బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. విశాఖ జిల్లా, రావికమతం మండలానికి చెందిన ఇద్దరు టీడీపీ ఎంపీటీసీలను వైసీపీ నేతలు బలవంతంగా ఎత్తుకెళ్లారని టీడీపీ నేతలు ఆరోపించారు. రావికమతం మండలంలో 20 ఎంపీటీసీ స్థానాలకు గానూ వైసీపీ అభ్యర్థులు, టీడీపీ మద్ధతుదారులు చెరో 10 స్థానాలు గెలుపొందారు. 
-----
తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ నేత‌ల్లో మరోసారి విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి తీరుపై పార్టీ ముఖ్య నేత‌ల వ‌ద్ద జ‌గ్గారెడ్డి అసంతృప్తి వ్య‌క్తం చేశారు. రేవంత్ రెడ్డి జ‌హీరాబాద్ వ‌స్తున్న‌ట్లు త‌నకు స‌మాచారం లేదని జ‌గ్గారెడ్డి అన్నారు. జ‌హీరాబాద్ వ‌స్తున్న‌ట్లు క‌నీసం గీతారెడ్డికి కూడా స‌మాచారం లేదని, వ్య‌క్తిగ‌త ప్ర‌చారానికే ఆరాట‌ప‌డితే పార్టీలో కుద‌ర‌దన్నారు. 
---
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ బ‌హిరంగ లేఖ రాశారు. గ‌త అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన రూ.లక్ష రుణమాఫీ హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు రుణమాఫీ కింద ఇవ్వాల్సిన రూ.27,500 కోట్ల నిధులను విడుదల చేయాలని చెప్పారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా సొమ్ము రూ.413.50 కోట్లు చెల్లించాల‌ని చెప్పారు. 
-----
టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుపై మరో కేసు నమోదైంది. ఇటీవల మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ వర్ధంతి సందర్భంగా సీఎం జగన్, మంత్రులు, ఇతర నేతలను ఉద్దేశించి అయ్యన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ హోం మంత్రి సుచరితకు ఇప్పుడు కనీసం ఎస్సై అయినా సెల్యూట్ చేస్తారా? అంటూ ఆయన కామెంట్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై నకరికల్లు స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి.
---
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ఉగ్రవాదంలో పాకిస్థాన్ పాత్ర గురించి చర్చించారు.వైట్ హౌస్ లో జరిగిన సమావేశంలో ఇండో-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేయాలని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నారు. పాకిస్థాన్‌లో పలు ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయని, ఈ విషయంలో ఇస్లామాబాద్ పై చర్యలు తీసుకోవాలని కమలాహారిస్ కోరారు
---------
ఆఫ్ఘ‌నిస్థాన్‌లోతాత్కాలిక ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు మాట మీద నిలబటడం లేదు. గ‌తంలోలా వ్య‌వ‌హ‌రించ‌బోమ‌ని మొదట్లో చెప్పిన తాలిబ‌న్లు..  ఆఫ్ఘ‌న్‌లో మ‌ళ్లీ అనాగ‌రిక విధానాల‌ను ప్ర‌వేశ‌పెట్టడానికి సిద్ధ‌మ‌య్యారు. 1990ల నాటిలాగే ఆఫ్ఘ‌న్‌లో ఇప్పుడు కూడా కాళ్లు, చేతులు నరకడం వంటి కఠిన శిక్షలు అమల్లో ఉంటాయని తాలిబ‌న్లు తేల్చి చెబుతున్నారు.