సంక్షేమానికి జగన్ జనగణమన

ప్రజా సంక్షేమమే మా ప్ర‌భుత్వ ధ్యేయ‌మని ప్ర‌చారం చేసుకున్నంత మాత్రాన సంక్షేమం చేప‌డుతున్న‌ట్టు కాదు. నిజంగానే ప్ర‌జ‌ల సంక్షేమానికి త‌గిన ప‌థ‌కాల‌తో వారికి ఆస‌రాగా నిల‌వాలి. కేవ‌లం ప‌థ‌కాలు ప్ర‌క టించ‌డం, యాప్‌లు త‌యారుచేయించి ప్ర‌జ‌ల‌కు తాయిలాలుగా ఇవ్వ‌డం త‌ప్ప ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్రత్యే కించి జ‌రుగుతున్న సంక్షేమ‌మేమీ లేద‌న్నది విశ్లేష‌కుల మాట‌. 

పేద‌ల జీవ‌న ప్ర‌మాణాలు మెరుగు ప‌ర‌చాలి, బీసీలు, ద‌ళితులు, గిరిజ‌నులు, ముస్లింలు, క్రిస్టియ‌న్ మైనారిటీల అభివృద్ధి గురించి ఆలో చించి ప‌థ కాలు చేప‌ట్టాలి. కానీ ఇవేమీ జ‌ర‌గ‌డ‌మే లేదు స‌రిక‌దా, గ‌తంలో ఉన్న సంక్షేమ ప‌థ‌కాలూ నిర్ల‌క్ష్యానికి గుర య్యాయి. బిసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేష‌న్ల ద్వారా ఆయా వ‌ర్గాల‌కు అందాల్సిన స‌హ‌కారం ఆగి పోయింది.  వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత మూడేళ్లుగా వారికి ఎలాంటి ఆర్థిక సాయం చేయకుండా మొండి చేయి చూపింది.
గ్రామీణ ప్రాంతాల్లో పలు రకాల యంత్రాల కొనుగోలుకు సబ్సిడీ  ఇచ్చి  సహకారమందించారు.  ఒక్కో యువ కుడికి రూ.లక్ష నుంచి రూ.20 లక్షల దాకా బ్యాంకుల ద్వారా రుణసాయం చేశారు. బ్యాంకులు రుణాలివ్వని సందర్భంలో కొంత మందికి ఎన్‌ఎస్ఎఫ్ డీఎస్‌, ఎన్‌టీఎఫ్డీఎస్‌ సహకారంతో నేరుగా ప్రభు త్వమే రుణాలందించింది. గిరిజన మత్స్యకారులకు వలలు, సైకిళ్లు, ఆటోలు, పెద్ద వాహనాలను 90 శాతం సబ్సిడీతో అందించారు. ఎస్టీ కార్పొరేషన్‌, ఐటీడీఏల ద్వారా పేద ఎస్టీ రైతులకు విద్యుత్‌ సౌకర్యం, బోర్లు, మో టార్లు, పైపులు తదితర సౌకర్యాలు కల్పించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక స్వయం ఉపాధి పథకానికే స్వస్తి పలికారు. 

కాంగ్రెస్‌ హయాంలో నిర్లక్ష్యం చేసిన ఎన్‌ఎస్‌‌టీఎఫ్‌డీసీని చంద్రబాబు ప్రభుత్వం పునరుద్ధరించింది. కానీ జగన్‌ సర్కారు వచ్చిన తర్వాత రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో కేంద్రం ఆ నిధులను నిలిపేసింది.  ము స్లిం, క్రిస్టియన్లకూ దక్కని రుణాలు ముస్లింలలో ఎక్కువ మంది పట్టణాలు, మండల కేంద్రాల్లో వెల్డింగ్‌, మెకాని క్‌ షాపులు, పాత ఇనుమ సామానుల అంగడి, తదితర చిన్న చిన్న స్వయం ఉపాధితో జీవనం సాగిస్తున్నా రు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు గత ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలు అమల్లోకి తెచ్చింది.

పలు రకాల కోర్సుల్లో శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పించింది.  చంద్రబాబు ప్రభుత్వం లో ముస్లిం, క్రిస్టియన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్ల ద్వారా ఏటా 10 వేల మందికి స్వయం ఉపాధి యూ నిట్లు ఏర్పా టు చేసుకునేందుకు సాయం చేసింది. దుకాన్‌, మకాన్‌ పథకాల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాం తాల్లో ప్రతి ఏటా వెయ్యి మంది ముస్లిం యువతకు నివాసం, దుకాణం నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వయం ఉపాధి యూనిట్లకు మంగళం పాడే సింది.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారిపోయింది. కేవలం ఐదు  కులాలకు చెందిన 44 లక్షల మందికి తప్ప మిగతా 1.70 కోట్లమంది బీసీల సంక్షేమం ఊసేలేద‌న్న‌ విమర్శలు వస్తున్నాయి. 4.37 లక్షల మంది కి ఏడాదికి రూ.10 వేలు చొప్పున అందజేసి, బీసీలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రచా రం చేసుకుంటోంది.