బీజేపీ  సీత‌య్య‌..! 

పిల్లాడికి పౌష్టికాహారం పెడుతున్నా ఎత్తు పెర‌గ‌డం లేద‌ని త‌లిదండ్రులు బాధ‌ప‌డ్డారు. ఒక‌రోజు ఎక్క‌డో విని ఒక  టేపు కొని రెండు నెల‌ల‌కోసారి వాడిఎత్తు కొల‌వ‌నారంభించారు. హాల్లో గోడ‌మీద స్కేలు గీత‌లు చూసి తెలిసిన‌వారికీ అర్ధ‌మ‌యింది. కానీ ప‌క్కింటివారిని పిలిచి మీరు మీ పిల్లాడి ఎత్తు గురించి ఆలోచిం చ‌మ‌ని చెప్ప‌లేదు. ఎవ‌ర‌యినా త‌మ అభివృద్దిని అంచ‌నా వేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. కానీ తెలంగాణాలో మాత్రం కేసీఆర్ ప్ర‌భుత్వం ఎప్పుడు కూల‌బోతున్న‌దీ బీజేపీ వారు లోకానికి తెలియ‌జేసే గ‌డియా రాన్ని ఏ ర్పాటు చేశారు. గ‌తంలోనూ ఇలాంటి కార్య‌క్ర‌మం చేప‌ట్టి ఈసీ నుంచి మొట్టికాయ‌లు వేయించు కున్నారు. అక్కడితో వారి ప్ర‌య‌త్నాలు మానుకున్నారు. ఇప్పుడు మ‌ళ్లీ మొద‌లెట్టారు. మ‌ద్ద‌తు నిచ్చే వారు పేర్లు రిజిస్ట‌ర్ చేసుకోవాల‌నీ కోరుతున్నారు. 

మళ్లీ 'సాలు దొర.. సెలవు దొర' అంటూ బీజేపీ డిజిటల్‌ బోర్డును ఏర్పాటు చేసింది. కేసీఆర్‌ పాలనకు కౌం ట్ డౌన్‌ పేరుతో బీజేపీ ఆఫీస్‌ దగ్గర డిజిటల్ బోర్డును ఏర్పాటు చేశారు. డిజిటల్‌ బోర్డును  బీజేపీ ఇంఛార్జ్‌ తరు ణ్ చుగ్ ప్రారంభించనున్నారు. గతంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారంటూ డిజిటల్‌ బోర్డులను జీహెచ్‌ఎంసీ అధికారులు నిలిపివేశారు. ఈసారి బీజేపీ ఆఫీస్‌ ప్రహారీ గోడ లోపల డిజిటల్‌ బోర్డ్ ఏర్పా టు చేసినట్లు బీజేపీ తెలిపింది. ఐరన్ పిల్లర్‌ నిర్మించి డిజిటల్‌ బోర్డ్‌ను ఏర్పాటు చేసినట్లు కమలం పార్టీ స్పష్టం చేసింది.

కేసీఆర్ ఆధిప‌త్యాన్ని దెబ్బ‌కొట్ట‌డం, అధికార‌పీఠం ఎక్క‌డం మాత్ర‌మే బీజేపీకి తెలంగాణా ల‌క్ష్యంగా మా రింది. ఆమ‌ధ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ‘సాలు దొర - సెలవు దొర’ ప్రచా రాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశించింది. ఈ ప్రచారంపై ఈసీ అభ్యం తరం వ్యక్తం చేసింది. ఈ ప్రచారంపై ఈసీకి టీఆర్‌ఎస్ పార్టీ ఫిర్యాదు చేయలేదు. అయితే, ఈ ప్రచారానికి అను మతి కోసం బీజేపీ పార్టీ చేసిన అభ్యర్థనతోనే ఈసీ ఈ క్యాంపెయిన్ గురించి పరిశీలించి నిలిపి వేయా లని ఆదేశించింది. సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కేసీఆర్‌ ఫొటోలతో పోస్టర్లు ముద్రిం చేందుకు బీజేపీ అనుమతి కోరగా.. ఎన్నికల సంఘం నిరాకరించింది. అలా చేసేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. సీఎం ఫొటోతో బీజేపీ పోస్టర్లు ముద్రించేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రచా రంపై బీజేపీ ఓ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.


వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు దూకుడైన నిర్ణయాలతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా కొంత కాలంగా ‘సాలు దొర - సెలవు దొర’ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. అటు.. టీఆర్‌ఎస్ కూడా నేరుగా ప్రధాని మోదీపై విమర్శలు కురిపిస్తూ ఈ ప్రచారాన్ని తిప్పికొడుతోంది.