జగన్ విచారణ పై ఈడీ పిటిషన్ 25వ తేదికి వాయిదా
posted on Jun 20, 2012 2:46PM
జగన్‌ను విచారించేందుకు అనుమతించాలన్న ఈడి పిటిషన్ ను కోర్టు 25వ తేదికి వాయిదా వేసింది. అయితే జగన్‌కు నోటీసులు అందజేయాలని కోర్ట్ ఈడికి సూచించింది. దీంతో ఈడి జగన్ తరఫు లాయర్లకు నోటీసులు అందించేందుకు సిద్ధమయ్యారు. అయితే జగన్ లాయర్లు ఈడి నోటీసులు తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో జైలులోనే జగన్‍కు నోటీసులు అందజేయాల్సిందిగా ఈడికి సిబిఐ కోర్టు సూచించింది.
కాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆక్రమాస్తుల కేసు, ఎమ్మార్ కేసు, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓఎంసి కేసులలో రిమాండులో ఉన్న నిందితులను విచారించేందుకు నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్‌కు అనుమతించిన విషయం తెలిసిందే. నిందితుల విచారణకు మంగళవారం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ కంపెనీలలో భారీగా పెట్టుబడులు పెట్టారని భావిస్తున్న బ్రహ్మానంద రెడ్డిని విచారించనున్నారు. ఎమ్మార్ కేసులో బిపి ఆచార్య, కోనేరు ప్రసాద్, సునీల్ రెడ్డి, విజయరాఘవలను విచారిస్తారు. ఓఎంసి కేసులో శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, శ్రీలక్ష్మిలను విచారిస్తారు. నిందితులను పదిహేను రోజులలో విచారించాలని కోర్టు ఈడికి ఆదేశాలు జారీ చేసింది.