జగన్ కు కేంద్రం వార్నింగ్? అందుకే వెనక్కి తగ్గారా?
posted on Oct 27, 2015 1:06PM
.jpg)
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ అటు కేంద్రానికి వ్యతిరేకంగా.. ఇటు రాష్ట్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసి.. పాపం ఆ ఆందోళనలకు సరైన రెస్పాన్స్ రాక చివరికి.. నిరాహార దీక్ష చేసినా పట్టించుకునే వారు లేక దీక్ష మధ్యలోనే విరమింపచేయాల్సి వచ్చింది. అంతేకాదు ఆఖరికి ఏపీ చరిత్రలోనే నిలిచిపోయే రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి కూడా వెళ్లకుండా తన వ్యతిరేకతను ప్రదర్శించారు. అయితే శంకుస్థాపన అనంతరం జగన్ ఇంకా రెచ్చిపోయి ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేపడతారని అందరూ అనుకున్నారు. అంతేకాదు జగన్ కు కాంగ్రెస్ పార్టీ కూడా తోడై చంద్రబాబుకు, కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతారని అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది.. అందుకు భిన్నంగా ఇప్పుడు జగన్ ఈ విషయంలో కొంచం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. కారణం జగన్ కు కేంద్రం నుండి ఫోన్ రావడమేనట.. ఈవిషయాన్ని కూడా స్వయంగా పార్టీ నేతలే చెబుతున్నారు. ఒకవేళ జగన్ ప్రత్యేక హోదా అంటూ మళ్లీ దీక్షలు మొదలుపెడితే అది ఒక్క చంద్రబాబుకే కాదు కేంద్రానికి కూడా సమస్యే అని భావించి.. ఈ విషయంలో జగన్ ను ఎలాగైనా కంట్రోల్ చేయాలని నిర్ణయించుకున్నారట. దీనిలో భాగంగానే కేంద్రం జగన్ కు ఫోన్ చేసి ప్రత్యేక హోదా గురించి ఉద్యమాలు అంటూ మొదలుపెడితే అనవసరంగా ఇబ్బందులు పడతావని.. ఎలాంటి గొడవలు చేయోద్దని హెచ్చరించారట. అందుకే జగన్ వెనక్కి తగ్గారట. మొత్తానికి జగన్ ఇబ్బందులు పడే అంశాలేంటో అందరికి తెలిసిందే ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు..