అసంతృప్తిని చల్లార్చడమే జగన్ అసలు ఎజెండా?!

ఆంధ్ర ప్రదేశ్ లో ముందస్తు ఎన్నికల వ్యూహాగానాలు జోరందుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో ఓ వైపు అధికార వైసీపీలో అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. అసమ్మతి గళాలు గర్జిస్తున్నాయి. మరోవైపు, మాట తప్పను మడమ తిప్పను అంటూ బీరాలు పోయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి   ఒక్కొక్క నిరయాన్ని వెనక్కి తీసుకుంటున్నారు. నిన్న మొన్నటిదాకా మంత్రులు, ఎమ్మెల్యేలకు బెత్తం పట్టుకుని పాఠాలు చెప్పిన ముఖ్యమంత్రి  ఇప్పడు  వెనకడుగు వేశారు. మెల్ల మెల్లగా బుజ్జగింపుల దారిలోకి  మారుతున్నారు.

వాస్తవానికి మూడు నాలుగు రోజుల కిందట ఢిల్లీ వెళ్ళక ముందు  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి,  2024 ఎన్నికలకు రూట్ మ్యాప్ సిద్దం చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల గాయాలకు  మంత్రుల ఉద్వాసనతో చికిత్స చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఐదారుగు, మంత్రులకు ఉద్వాసన చెప్పే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారనీ,  త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని వార్తలొచ్చాయి. అయితే జగన్ రెడ్డి డిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన  టోన్ మారిందని, సీన్ రివర్సైందనీ అంటున్నారు. అందుకే మంత్రుల ఉద్వాసన, మంత్రివర్గ విస్తరణ అలోచనను ముఖ్యమంత్రి ప్రస్తుతానికి పక్కన పెట్టేశారని చెబుతున్నారు. 

అలాగే  గడప గడపకు పరీక్షలో ఫెయిల్ అయిన 40 మందికి పైగా ఎమ్మెల్యేలకు ( అందులో కొందరు మంత్రులు కూడా ఉన్నారుట) తాఖీదులు ఇచ్చిన ముఖ్యమంత్రి  ఇప్పడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే  టిక్కెట్ విషయం కన్ఫర్మ్ చేసుకునేందుకు ముఖ్యమంత్రిని కలిసిన ఇద్దరు ఎమ్మెల్యేలకు ఆయన మళ్ళీ టికెట్ ఇచ్చేది లేదని ముఖం మీదనే  చెప్పడంతో ఆ ఇద్దరు  ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో.. ఆ ఇంటికి ఈ ఇల్లు అంటే దూరమని  ఆత్మ ప్రభోధం మేరకు ఓటు వేశారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఇంత ఇన్స్టంట్ తిరుగుబాటును ఊహించలేదో ఏమో కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో ఓటమి ఎదురుకాడంతో ముఖ్యమంత్రి కంగుతిన్నారని అంటున్నారు. అప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడుకు మూడు స్థానాలను టీడీపీ ఎగరేసుకు పోవడంతో, జగన్ రెడ్డి  షాక్ కు గురయ్యారు. అదే సమయంలో ఢిల్లీ పెద్దలకు, ఇంటెల్జెన్సీ వర్గాల నుంచి ఎలాంటి నివేదికలు వచ్చాయో ఏమో కానీ, ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలిపించి పెట్టవలసిన నాలుగు పెట్టిపంపారని అంటున్నారు. 

నిజానికి  కేవలం 15 రోజుల వ్యవధిలో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి ఢిల్లీ ఎందుకు వెళ్ళారనే విషయంలో  అనేక వ్యుహాగానాలు వినిపించినా, నిజానికి ముఖ్యమంత్రి తనంతట తానుగా ఢిల్లీ వెళ్ళలేదని, ఢిల్లీ పెద్దల ‘ఆదేశం’  మేరకే ఆయన ఢిల్లీ వెళ్ళారని విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ఆధారంగా ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన సమాచారం మేరకే, ఢిల్లీ పెద్దలు జగన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపింఛి పరిస్థితిని వివరించినట్లు తెలుస్తోంది. అందుకే విషయ తీవ్రతను దృష్టిలో ఉంచుకునే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా బాగా పొద్దుపోయిన తర్వాత, అర్థ రాత్రికి అరగంట ముందు జగన్ రెడ్డికి  అప్పాయింట్మెంట్ ఇచ్చారని అంటున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తన ధోరణి మార్చుకోకపోతే, చాలా పెద్ద సంఖ్యలో,  ఇంచు మించుగా హాఫ్ సెంచరీ వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారని, అమిత్ షా  జగన్ కు స్పష్టంగా వివరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందుకే ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ధోరణిలో మార్పు కనిపిస్తోందని అంటున్నారు. 

ఈ నేపథ్యంలో సోమవారం(ఏప్రిల్ 3) జరిగే ఎమ్మెల్యేలు, రీజినల్ కోఆర్డినేటర్ల సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేంలో  జగన్ రెడ్డి చెప్పే ఢిల్లీ ముచ్చట్లు ఏమిటనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, ముందుగా అనుకున్నట్ల్గు మంత్రి వర్గ విస్తరణ ప్రస్తావన ఉండక పోవచ్చని, అలాగే గడప గడప పరీక్ష ప్రస్తావన కూడా ఉండదని అంటున్నారు. 

   ముఖ్యంగా సమావేశంలో ముఖ్యమంత్రి ఏమి మాట్లాడినా ఈ సమావేశం ప్రధాన లక్ష్యం మాత్రం పార్టీలో రగులుతున్న అసంతృప్తిని చల్లార్చడమే అని వైసీపే ముఖ్య నేతలే చెబుతున్నారు.  అలాగే  ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమి తర్వాత ఎమ్మెల్యేల ఆలోచనలు ఎటుగా వెళుతున్నాయి. తట్టాబుట్టా సర్దుకుంటున్న ఎమ్మెల్యే ఎవరు? ఎంత మంది ? తెలుగు దేశం పార్టీతో టచ్ లో ఉన్నఎమ్మెల్యేలు ఎవరు? ఎంతమంది? అనే కోణంలో విచారణ జరిపేందుకే ముఖ్యమంత్రి ఈ సమావేశం ఏర్పాటు చేశారని అంటున్నారు. అదే నిజమైతే మాట తప్పని, మడమ తిప్పని ముఖ్యమంత్రి  మాట తప్పడం మడమ తిప్పడం మాత్రమే కాదు, స్వరం మార్చి బుజ్జగింపు ప్రసంగం చేసినా ఆశ్చర్య పోనవసరం లేదంటున్నారు.

నిజానికి, ఈ సమావేశం ఢిల్లీ పెద్దల కనుసన్నల్లో జరుగతున్న సమావేశంగానూ అనుమానిస్తున్నారు. అయితే, వైసీపీ అంతర్గత వ్యవహారాల్లో బీజేపీ నాయకత్వం ఎందుకు జోక్యంచేసుకుంటోంది.  వైసీపీ బీజేపీ నాయకత్వాన్ని తమ పార్టీ సూపర్  హై కమాండ్ గా ఎందుకు అంగీకరిస్తోంది అనేది ఇప్పుడు చర్చనీయాంశం మారింది. తమిళనాడులో అన్నా డిఎంకేని ట్రీట్ చేస్తున్న విధంగా, ఏపీలో వైసీపీని బీజేపీ హై కమాండ్ ట్రీట్ చేస్తోందా? అనే ప్రశ్నలు వినవస్తున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu