జగన్ ఆశ నెరవేరుతుందా...?

 

ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అందరూ ఆసక్తి కరంగా చూసే అంశం ఒక్కటే.. ప్రతిపక్ష పార్టీ నేత జగన్మోహన్ రెడ్డికి కోర్టు మినహాయింపు ఇస్తుందా..?లేదా...? అన్నది. కోర్టు ఇచ్చే ఈ తీర్పుపైనే వచ్చే ఎన్నికల భవిష్యత్ ఆధారపడి ఉంది. తాను పాదయాత్ర చేయాలనుకుంటున్నానని.. అందుకోసం కోర్టు హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని జగన్.. హైకోర్టును ఆశ్రయించగా.. ఈ వ్యవహారం సీబీఐ కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు చెప్పడంతో.. సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈ పిటిషన్ పై ఈరోజు తుది నిర్ణయం వెలువడనుంది. ఈ నేపథ్యంలోనే జగన్ కోటి ఆశలతో కోర్టుకు బయలుదేరారు. దీంతో కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అనేది సర్వాత్రా ఉత్కంటగా మారిపోయింది.

 

ఇదిలా ఉండగా.. తీర్పు అనుకూలంగా వస్తే సరి.. కానీ రాకపోతే ఏంటని ఇప్పటికే వైసీపీ నేతలు చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలోనే జగన్..నాయకులతో చర్చలు జరుపుతున్నారట.ఒక వేళ అనుకూలంగా లేకపోతే ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి పాదయాత్రలో ఎటువంటి స్ట్రాటజీ పాటించాలి అనేది చర్చిస్తున్నారట. అంతేకాదు తీర్పు తమకి అనుకూలంగా రాకపోతే…ఏమి చేయాలనే విషయంపై వైసీపీ నేతలకి క్లారిటీ లేదని..ఒక వేళ అనుకూలంగా తీర్పు రాకపోతే వైసీపికి ఇది కోలుకోలేని దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అసలే కేడర్ లేక కుదేలవుతున్న పార్టీకి ఉపు తెచ్చేందుకు జగన్ పాదయాత్ర ప్రారంభించి తన తండ్రిలా మార్కులు కొట్టేసి సీఎం కుర్చీ ఎక్కేదాం అనుకున్నారు..ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సక్సెస్ అవుతుందా లేదా అనేది కోర్టు నిర్ణయం మీద ఆధారపడి ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో...