జగన్ నిర్ణయం.. కాంగ్రెస్ కు లాభం..!

 

అదేదో సినిమాలో హీరో ఒక్క ఛాన్స్..ఒకే ఒక్క ఛాన్స్ అంటూ అడగటం చూసే ఉంటాం కదా. అలాగే రాష్ట్రవిభజన తరువాత కూడా కాంగ్రెస్ పరిస్థితి అదే అయింది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టినందుకు గాను  ప్రజలు గట్టిగానే బుద్ది చెప్పారు. దీంతో ఒక్క ఛాన్స్ కోసం కాంగ్రెస్ అర్రులు చాచి వెయిట్ చేస్తుంది. అయితే ఇప్పుడు జగన్ రూపంలో కాంగ్రెస్ కు కాస్త లాభం చేకూరుతున్నట్టే కనిపిస్తోంది. అదేలాగ అంటారా..?

 

త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నసంగతి తెలిసిందే. ఈ ఎన్నికల హీట్ ఇప్పటి నుండే మొదలైంది. ఎలాగైనా బీజేపీ తమ ప్రత్యర్ధిని గెలిపించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. నిజం చెప్పాలంటే ఈ ఏడాది బీజేపీకి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. అన్ని ఎన్నికల్లో ఘన విజయం సాధించి తన సత్తా చాటుకుంది. దాదాపు మెజార్టీ బీజేపీకే ఉంది. ఏవో బీజేపీ అంటే పడని కొన్ని పార్టీలు తప్ప మిగిలిన అన్ని చోట్ల బీజేపీకి బాగానే సపోర్ట్ ఉంది. ఇక బీజేపీకి మిత్ర పక్షాలుగా ఉన్న పార్టీలు ఎలాగూ సపోర్ట్ ఇస్తాయి. ఇక అన్ని పార్టీల లాగానే జగన్ కూడా తమ మద్దతు బీజేపీకే అని చెప్పాడు. ఇక్కడే జగన్ పప్పులో కాలేశాడని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి.

 

ఇటీవల వచ్చిన సర్వే ప్రకారం చూసుకుంటే త్రిపురలో కూడా బీజేపీనే గెలవచ్చు అని చెబుతున్నాయి. త్రిపురలో క్రిస్టియన్ మెజార్టీ ఎక్కువగా ఉంటుంది. అలాంటి త్రిపురలోనే బీజేపీ గెలుస్తుందని చెబుతున్నారు. గోవాలో కూడా క్రిస్టియన్ మెజార్టీ ఎక్కువ అయినా గెలిచింది. యూపీలో ముస్లింల ఓట్లను కూడా బీజేపీ సంపాదించుకుంది. అలాంటి రాష్ట్రాల్లోని బీజేపీకి గెలిచినప్పుడు.. ప్రజలు బీజేపీని నమ్మి ఓటు వేసినప్పుడు..ఇక్కడ కూడా అలానే వేస్తారునుకుంటున్నట్టున్నాడు జగన్. అదే కాలిక్లేషన్ తో బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నా అని చెప్పి నిర్ణయం తీసేసుకున్నాడు. ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయమే కాంగ్రెస్ కు కలిసొస్తుందని అంటున్నారు. చచ్చిపోయిన కాంగ్రెస్ గొంతులో జగన్ నిర్ణయం తులసి నీళ్లు పోసినట్టుయిందని అంటున్నారు. ఎందుకంటే జగన్ కు కూడా మైనార్టీ మెజార్టీ ఎక్కువ. అయితే వారు బీజేపీకి వ్యతిరేకం అని తెలిసిందే. మరి అక్కడి ఫార్ములానే జగన్ దృష్టిలో పెట్టుకొని.. ఇక్కడ కూడా అదే ఫార్ములా వాడారు అంటున్నారు. ఇదే జగన్ కు మైనస్, కాంగ్రెస్ కు ప్లస్ అవుతుందని అంటున్నారు.


దీంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కాస్త పుంజుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతేకాదు రాబోయే మథర్సే డే సందర్భంగా పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ కు మంచి గిఫ్ట్ ఇచ్చిందని చలోక్తులు వేసుకునే వారు కూడా ఉన్నారు. మరి జగన్ తీసుకున్న నిర్ణయం జగన్ ను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనేలా చేస్తుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.