జగన్ ఫై తెదేపా నేత రేవంత్ రెడ్డి ధ్వజం

హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో లంచాలు వైఎస్.జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక సాక్షిలోకిపెట్టుబడుల రూపంలో వచ్చాయని,తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ పెట్టుబడుల అంశంలో ప్రభుత్వాన్ని, సీబీఐను సాక్షి యాజమాన్యం తప్పుదారి పట్టిస్తోందని మండిపడ్డారు.దీనిపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ కుంభకోణం జరిగినా దాంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, వైఎస్ కుటుంబ సభ్యులకు, ఆయన అనుచరులకు, బంధువులకు సంబంధం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.

వైయస్ జగన్ సంస్థల్లోకి అక్రమ పెట్టుబడులు వచ్చాయని తాము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. జగన్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన అన్నారు. తాము అవినీతిని ప్రశ్నిస్తుంటే తమపై ఎదురు దాడికి దిగుతున్నారని, తమ పార్టీపై అవాకులు చెవాకులు పేలుతున్నారని రేవంత్ మండిపడ్డారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu