నింగిలోకి దూసుకెళ్తున్న జిఎస్‌ఎల్‌వి మార్క్-3 డి1
posted on Jun 5, 2017 5:46PM
.jpg)
ఇస్రో మరో చరిత్ర సృష్టించింది. జిఎస్‌ఎల్‌వి మార్క్-3 డి1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రెండో ప్రయోగ కేంద్రం నుండి.. జిఎస్‌ఎల్‌వి మార్క్-3 డి1 నింగిలోకి దూసుకెళ్లింది. దీనిద్వారా 3,136 కిలోల భారీ ఉపగ్రహం జీశాట్-19ని రోదసీలోకి ప్రవేశపెట్టారు. దీంతో ఇస్రో అంతరిక్షంలో త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించింది.
జీఎస్‌ఎల్‌వీ-మార్క్3డీ1 విశేషాలు..: రాకెట్ బరువు 640 టన్నులు. ఎత్తు 43 మీటర్లు. ఇందులో మూడు దశలు ఉంటాయి. మొదటి దశలో ఎస్200 మోటార్లు రెండు, రెండో దశలో ఎల్110 లిక్విడ్ కోర్ ఇంజిన్, మూడో దశలో సీ25 క్రయోజెనిక్ ఇంజిన్ ఉన్నాయి. ఈ క్రయోజినిక్ ఇంజిన్ ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్ప జరిపారు. కాగా క్రయోజినిక్ ఇంజిన్ లో 28 టన్నుల శీతల ఇంధనాలు ఉంటాయి.