వైసీపీలో సజ్జల సినిమా అయిపోయినట్లేనా?

సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాయిస్ సజ్జల రామకృష్షారెడ్డే. వైసీపీ అధికారంలో ఉండగా సజ్జల డిఫాక్టో సీఎంగా వ్యవహరించారు. సకల శాఖల మంత్రిగా పేరు గడించారు. ఏ శాఖకు సంబంధించైనా సరే ఆ శాఖ మంత్రికి సంబంధం లేకుండా, కనీస సమాచారం కూడా లేకుండా సజ్జల నిర్ణయాలు తీసుకునే వారు. మీడియా సమావేశాలు నిర్వహించే వారు. వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత కొంత కాలం సజ్జల మౌనం వహించినా.. ఆ తరువాత షరా మామూలే. జగన్ కుడి భుజంగా పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. పార్టీలో జగన్ తరువాత స్థానం సజ్జలదే అని పార్టీ శ్రేణులు కూడా చెబుతాయి.

అయితే తాజాగా జగన్ దగ్గర సజ్జల సీన్ అయిపోయిందని వైసీపీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి. ఇంత హఠాత్తుగా సజ్జలకు అంతటి మర్యాద? ఎందుకయ్యా అంటే.. పార్టీ వర్గాలు చెబుతున్నదానిని పట్టి.. ఇటీవల అమరావతి రాజధాని విషయంలో వైఎస్ జమన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన అంటున్నారు పరిశీలకులు, ఐను ఇటీవల జస్జల చేసిన ప్రకటన,వ్యాఖ్యలు వైసీపీకి తీరని డ్యామేజీ చేశాయని అంటున్నారు.  ఇంతకీ ఆయన ఏమన్నారంటే..మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా  ఇక మూడు రాజధానుల మాటే ఎత్తదు? అమరావతే రాజధాని, విశాఖ కానే కాదు. జగన్ తాడేపల్లిలోనే ఉంటారు. గుంటూరు, విజయవాడల మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధానికి అభివృద్ధి చేస్తారు. అని ఆయన మీడియా సమావేశంలో కుండబద్దలు కొట్టేశారు.

 జగన్ అమరావతి రాజధానిక సానుకూలంగా ఉన్నారనీ, విశాఖ ఊసే ఎత్తరు అని చెప్పడం ద్వారా జగన్ హయాంలో మూడు రాజధానుల విధానం తప్పు అని ఒప్పుకోవడమే కాకుండా.. ఎలాంటి ప్రణాళికా, వ్యూహం లేకుండా కేవలం చంద్రబాబుపై కక్షతోనే ఇప్పుడు జగన్ అమరావతికి జై కొడుతున్నారన్న ప్రచారం ప్రజలలో బలంగా వెళ్లిపోయింది. అంతే కాకుండా అధికారంలో ఉన్నంత కాలం మూడు రాజధానులంటూ జగన్ కాలక్షేపం చేయడం కక్ష సాధింపుతోనే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోపం కాదని సజ్జల తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేసినట్లైంది. దీంతో జగన్ ప్రతిష్ఠ పాతాళానికి పడిపోయింది.  ఈ కారణంగానే జగన్ సజ్జలను పూర్తిగా పక్కన పెట్టేశారని అంటున్నారు. అంతే కాదు సొంత మీడియాలో కానీ, పార్టీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడా సజ్జల పేరు, ఫొటో కనిపించడానికి వీల్లేదన్న ఆదేశాలు కూడా జారీ చేసినట్ల చెబుతున్నారు. అందుకే గత కొన్ని రోజులుగా జగన సొంత మీడియాతో పాటు సామాజిక మాధ్యమంలో కూడా సజ్జల నిపించడం లేదు. వినిపించడం లేదు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu