అఖండ‌పై జ‌గ‌న్‌రెడ్డి అస్త్రం!.. బాల‌య్య టార్గెట్‌గానే స‌వ‌ర‌ణ‌ బిల్లు?

అఖండ. బాల‌కృష్ణ‌-బోయ‌పాటి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న‌ మోస్ట్ అవేటెడ్ మూవీ. డిసెంబ‌ర్ 2న రిలీజ్ డేట్‌. క‌ట్ చేస్తే.. అఖండ రిలీజ్‌కు స‌రిగ్గా వారం రోజుల ముందు.. న‌వంబ‌ర్ 24న ఏపీ అసెంబ్లీలో సినిమాటోగ్ర‌ఫీ స‌వ‌ర‌ణ బిల్లు. థియేట‌ర్ల‌లో రోజుకు 4 ఆట‌లు మాత్ర‌మేన‌ని.. ఇక‌పై బెనిఫిట్ షోలు ఉండ‌వ‌ని.. ఆన్‌లైన్లోనే టికెట్ల అమ్మ‌కం.. టికెట్ రేట్ల‌ను ప్ర‌భుత్వం నిర్ణ‌యించడం.. ఇలా అనేక నిబంధ‌న‌లు ఉన్నాయి ఆ బిల్లులో. ఈ బిల్లు తీసుకొచ్చిన స‌మ‌యం, సంద‌ర్భం చూస్తుంటే.. బాల‌కృష్ణ-అఖండ‌ టార్గెట్‌గానే ప్ర‌భుత్వం దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అంటున్నారు. 

గ‌తంలో తిరుప‌తి ఎంపీ ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌-వ‌కీల్‌సాబ్ టార్గెట్‌గా ఇలానే చేసింది జ‌గ‌న్ స‌ర్కారు. బెనిఫిట్ షోస్‌కి ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేదు. టికెట్ ధ‌ర‌ల‌ను పెంచ‌నివ్వ‌లేదు. ఇదే విష‌యంపై ఆ త‌ర్వాత జ‌న‌సేనాని జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వంపై, మంత్రి పేర్ని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. త‌న‌పై కోపం, క‌క్ష్య ఉంటే త‌న‌ను ఇబ్బంది పెట్ట‌డం.. అంతేకానీ సినిమాను, సినిమా వాళ్ల‌ను కాదంటూ స్ట్రాంగ్‌గా అటాక్ చేశారు. వ‌కీల్‌సాబ్‌ ఎపిసోడ్ ముగిసింది. ఇప్పుడు బాల‌య్య‌ వంతు వ‌చ్చింది. మ‌రోవారంలో అఖండ రిలీజ్ అవనుండ‌గా.. ఇప్పుడు మ‌రోసారి సేమ్ స్ట్రాట‌జీ అప్లై చేస్తోంది. అఖండ క‌లెక్ష‌న్ల‌ను ఆగ‌మాగం చేసేలా.. బాల‌కృష్ణ సినిమాను ఇబ్బందిపాలు చేసేలా.. సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ చేసేలా బిల్లు ప్ర‌వేశ‌పెట్టింది వైసీపీ ప్ర‌భుత్వం. 

ఇటీవ‌ల అసెంబ్లీలో చంద్ర‌బాబు-భువ‌నేశ్వ‌రీల గురించి వైసీపీ స‌భ్యులు అభ్యంత‌క‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం.. చంద్ర‌బాబు వెక్కి వెక్కి ఏడ్వ‌డం.. వైసీపీ ఎమ్మెల్యేల‌పై నంద‌మూరి కుటుంబం తీవ్ర స్థాయిలో మండిప‌డ‌టంతో ఏపీలో రాజ‌కీయ ఉద్రిక్త‌త నెల‌కొంది. ఆ ప‌రిణామంపై భువ‌నేశ్వ‌రి సోద‌రుడు నంద‌మూరి బాల‌కృష్ణ జ‌గ‌న్‌రెడ్డి అండ్ బ్యాచ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మ‌రోసారి రిపీట్ అయితే మీ భ‌ర‌తం ప‌డ‌తాం.. ఖ‌బ‌డ్దార్ అంటూ గ‌ట్టిగా హెచ్చ‌రించారు. చేయ‌కూడ‌ని త‌ప్పుచేశారు కాబ‌ట్టి.. జ‌న‌మంతా చీద‌రించుకుంటున్నారు కాబ‌ట్టి.. ఆ త‌ర్వాత‌ తేలుకుట్టిన దొంగ‌ల్లా.. నోరేసుకుప‌డే ఆ నేత‌ల నోళ్లకు తాళాలు ప‌డ్డాయని అంటున్నారు. త‌మ‌కు అంత‌గా వార్నింగ్ ఇచ్చిన బాల‌కృష్ణ‌ను ప‌రోక్షంగా దెబ్బ‌కొట్టేందుకే.. ఇప్పుడు హ‌డావుడిగా ఆ బిల్లు తీసుకొచ్చార‌ని భావిస్తున్నారు. 

ఈ బిల్లుకు చాలా ప‌వ‌ర్ ఉంది. బెనిఫిట్ షోల భ‌ర‌తం ప‌డుతుంది. క‌లెక్ష‌న్ల‌కు బాగా డ్యామేజ్ జ‌రుగుతుంది. మొద‌ట ప‌వ‌న్ క‌ల్యాణ్ కోస‌మే ఈ రూల్స్ తీసుకొచ్చారు. ఇదేదో బాగుంద‌నుకొని.. ఇప్పుడు అఖండ మీదా ప్ర‌యోగించ‌బోతున్నారు. దారికి రాని టాలీవుడ్‌ను ఈ బిల్లుతో దారికి తెచ్చుకునే ఎదురుదాడి ఇది అంటున్నారు. తెలుగు సినిమా పెద్ద‌ల‌ను త‌మ చెప్పుచేత‌ల్లో పెట్టుకునేందుకే.. త‌మ‌కు గిట్ట‌ని, రాజ‌కీయ రంగు ఉన్న‌ సినిమాల‌ను, హీరోల‌ను తొక్కేసేందుకే ఇలాంటి రూల్స్ తీసుకొస్తున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. 

మొద‌టి దెబ్బ ఇప్ప‌టికే వ‌కీల్‌సాబ్‌కు త‌గిలింది. సెకండ్ ఎఫెక్ట్ అఖండ‌పై ప‌డ‌నుంది. ఇక అస‌లు దిమ్మ‌తిరిగే షాక్ సంక్రాంతికి చూపించ‌నుంది. పొంగ‌ల్ బ‌రిలో నిలిచే.. RRR, భీమ్లా నాయ‌క్‌, రాధేశ్యామ్‌ల ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మార‌నుంది. మ‌రి.. ఇంత మందిని, అంత పెద్ద సినిమాల‌ను దెబ్బ‌కొట్టి.. జ‌గ‌న్‌రెడ్డి ఏం సాధించాల‌నో? రాజ‌కీయంగా, అప్పుల రూపంలో ఆర్థికంగా ఎంత లాభ‌ప‌డాల‌నో?

ఆ న‌లుగురికీ మ‌రింత‌ భ‌ద్ర‌త.. అంటే, మ‌రింత రెచ్చిపొమ్మ‌నేనా?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu