సంక్రాంతి వస్తోంది.. కోడి పందాలకు ఓకేనా

సంక్రాంతి అంటేనే సంబురాల పండగ. సందడి పండగ. ఒక వైపు రంగు రంగుల హరివిల్లులు, మరో వైపు హరిదాసు సంకీర్తనలు, డూ డూ బసవన్న విన్యాసాలు, ఇంకో వైపు కర్ర, కత్తిసాము, హోరెత్తించే డప్పు కళాకారుల ప్రదర్శనలు, కోలాటం, పులి వేషాలు, ఈ అన్నింటినీ మించి కోడిపందాలు, ఎడ్ల పందాలు. ఏమున్నా, ఏమి లేక పోయినా కోడి పందాలు, ఎడ్ల పందాలు లేనిదే సంక్రాంతి, సంక్రాంతే కాదు. అసలు అదొక పండగే కాదు. 

ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో జరిగే కోళ్ల పందాలు దేశంలోనే కాదు, విదేశాలలో కూడా వెరీ పాపులర్. కేవలం కోడి పందాలు చూసేందుకే, ఇరుగు పొరుగు రాష్ట్రల నుంచే కాదు   కాదు విదేశాల నుంచి కూడా వస్తుంటారు.అ యితే, చాలా కాలంగా ప్రభుత్వాలు  కోడి పందాలు , ఎడ్ల పందాలపై ఆంక్షలు విదించడంతో ప్రజల ముందస్తు సంబురాల మీద నీళ్లు జల్లు తున్నాయి. జీవహింస నిషేధం పేరిట, గ్యామ్బ్లింగ్ నిషేధం పేరున ప్రభుత్వ  యంత్రాంగం, పోలీసులు ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం కూడా అనవాయితీగా వస్తోంది.

ఈ నేపధ్యంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, సంక్రాంతి, ఉగాది పండుగ ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జరుపుకునేందుకు  శాశ్వతంగా అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో ముద్రగడ, సంక్రాంతి, అదే విధంగ ఉగాదికి  5 రోజులు చొప్పున కోడి పందాలు,ఎడ్ల పందాలు సహా సాంప్రదాయ పద్దతిలో సంబరాలు జరుపుకునేందుకు శాశ్వతంగా అనుమతి ఇవ్వాలని, పర్మిషన్‌కి పర్మినెంట్‌ ఆర్డర్సు ఇప్పించాలని కోరారు.ఎలేఖలో అయన సంక్రాంతి పండుగ సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని ప్రస్తావించారు., “ఇది చాలా సున్నిత విషయం.  గ్రామాలలో సంక్రాంతి, ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తున్న ఆచారం. ఈ సందర్భంగా ఎడ్లు, గుర్రం, కోడి వందాలు,ఆటల పోటీలు, జాతరలు వగైరాలతో సుమారు 5 రోజులు పండుగలు జరుపుకుంటారరు” అని పేర్కొన్నారు.

అయితే ఈ మధ్యకాలంలో పండగ ఉత్సవాలలో ప్రభుత్వ ఆదేశాలతో పోలీసువారు చాలా ఇబ్బందులు పెట్టడం, ఆఖరిలో పర్మిషన్‌ ఇచ్చామని తూతూ మంత్రం చేస్తున్నారన్నారు. పోలీసు శాఖ కూడా ఇబ్బందులకు గురి అవుతున్న సంగతి గమనించాలన్నారు. అయితే, ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, హిందువుల పట్ల, హిందువుల పడగల విషయంలో వివక్ష చూపుతున్నరనే  ఆరోపణలున్నాయి. అలాగే, గత సంవత్సరం కూడా సంక్రాంతి, ఉగాది సందర్భంలో పోలీసులు అతికి పోయి పండగ రోజుల్లోనూ ప్రజలను వేదింపులకు గురొఇ చేశారనే ఆరోపణలున్నాయి. మరి ఈసంవత్సరం ఏమి చేస్తారో ఏమో చూడాలి.. ..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu