గీతం యూనివర్శిటీలో కెరీర్ ఫెయిర్ లోగో ఆవిష్కరణ

నాస్కామ్, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో మార్చి 5, 6 తేదీల్లోకెరీర్ ఫెయిర్ నిర్వహించనున్నారు. యువతీ, యువకులకు సుమారు 10వేల ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఈ కెరీర్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ఈ కెరీర్ ఫెయిర్‌లో ఐటీ, ఐటీఈఎస్ 49 కంపెనీలు భాగస్వామ్యం అవుతున్నాయి.  ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఆవిష్కరించారు. 
2024, 2025లో ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ, యువకులు  అవకాశాన్ని సద్వినియోగం  చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నాస్కామ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ఉప్మిత్ సింగ్ పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu