ఇండియా-బంగ్లా క్వార్టర్ ఫైనల్ 19నే...

 

వరల్డ్ కప్ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు అన్నిట్లోనూ గెలిచిన భారత క్రికెట్ జట్టు విజయవంతంగా క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రవేశించిన విషయం తెలిసిందే. భారత జట్టు బంగ్లాదేశ్ జట్టుతో క్వార్టర్ ఫైనల్స్ ఆడుతుంది. పూల్ బీలో ప్రథమ స్థానంలో వున్న భారత జట్టు పూల్ ఏలో నాలుగో స్థానంలో వున్న బంగ్లాదేశ్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. గతంలో ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈ మ్యాచ్ ఈనెల 21వ తేదీన వెల్లింగ్‌టన్‌లో జరగాల్సి వుంది. అయితే ఈ షెడ్యూలును ఇంటర్నేషనల్‌ క్రికెట్ కౌన్సిల్ మార్చింది. ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ని మార్చి 19వ తేదీ (గురువారం)న జరపాలని నిర్ణయించింది. ఆరోజున భారత కాలమాన ప్రకారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu