చైనా కంటే భారత్ లోనే ఎక్కువట..

 

భారత్ కు చైనాకు మధ్య ఎప్పుడూ పోటీ వాతావరణం ఉంటుంది. ఏదో ఒక విషయంలో రెండూ విషయాలు పోటీ పడుతూనే ఉంటాయి. ఆఖరికి జనాభా విషయంలో కూడా. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదీ..? ఈ ప్రశ్న అడిగిన వెంటనే ఎవరైనా చైనా అని టక్కున చెప్పేస్తారు. అయితే ఇప్పుడు అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా కాదంటా.. భారత్ అట. ఈ విషయాన్ని  యి ఫుక్సియన్‌ అనే పరిశోధకుడు చెప్పాడు. చైనాలోని పెకింగ్‌ విశ్వవిద్యాలయంలో ఓ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఆయన... చైనా అధికారిక జనాభా లెక్కలు తప్పుడువని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు దానికి సంబంధించి ఆయన కొన్ని క్యాలిక్లేషన్స్ కూడా వేసి చెప్పారు.  1991 నుంచి 2016 వరకూ చైనాలో 377.6 మిలియన్ల జననాలు నమోదు అయ్యాయి. కానీ, రికార్డుల్లో మాత్రం ఇదే కాలంలో 464.8 మిలియన్ల జననాలు జరిగినట్లు ఉంది. దీన్ని బట్టి ప్రస్తుతం చైనా జనాభా 1.38 బిలియన్లు కాదని తేలిపోతుందని చెప్పారు. 2003 నుంచి ఇలా చైనా అధికారిక రికార్డుల్లో జనాభా లెక్కలు తప్పుగా వస్తున్నాయని తాను గ్రహించినట్లు వెల్లడించారు.