ప్రభుత్వ అధికారులపై యోగి కొరడా... ఏం చేస్తున్నారు..!

 

 

యూపీలోని ప్రభుత్వ అధికారుల పై సీఎం ఆధిత్యనాథ్ తన కొరడా ఘళించారు. ఇద్దరు సీనియర్‌ పోలీసు అధికారులను, ఓ ఐఏఎస్‌ అధికారిని సస్పెండ్‌ చేశారు. అసలు సంగతేంటంటే...షహరాన్‌పూర్ జిల్లాలోని షబ్బీర్‌పూర్‌ గ్రామంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి సభ నిర్వహించగా.. ఆ సభలో పాల్గొన్న దళితుడు ఒకరు బుధవారం హత్యకు గురయ్యాడు. రాజ్‌పుత్‌ వంశస్తుడైన మహారాణా ప్రతాప్‌ జయంతి సందర్భంగా నిర్వహించిన ఊరేగింపు పట్ల దళితులు అభ్యంతరం  వ్యక్తం చేయడంతో ఘర్షణ మొదలైంది. ఇక్కడ ఇరు వర్గాల మధ్య జరిగిన కొట్లాటలో ఓ వ్యక్తి మరణించగా, 15 మంది గాయపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంతేకాదు ఈ ఘటన వల్ల షహరాన్‌పూర్‌లో దళితులు, రాజ్‌పుత్‌ ఠాకూర్ల మధ్య కులవైరంతో గత నెల రోజులుగా ఘర్షణలకు పాల్పడుతున్నారు. ఈ కారణంతో హింసాత్మక ఘర్షణలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైన కారణంతో జిల్లాకు చెందిన సీనియర్‌ ఎస్పీ ఎస్సీ దుబేను, జిల్లా కలెక్టర్‌ ఎన్పీ సింగ్‌ను యోగి సర్కారు సస్పెండ్‌ చేసింది. అంతేకాకుండా జిల్లా డీఐజీ జేకే సాహిపై కూడా వేటు వేసింది. షహరాన్‌పూర్‌లో హింసకు కారణమైన ప్రతి ఒక్కరిపైనా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని యోగి సర్కారు హెచ్చరించింది.