హెచ్సీయూ.. రాత్రికి రాత్రే శివలింగం, నంది, నాగ దేవత విగ్రహాలు
posted on May 26, 2016 5:51PM

దళిత విద్యార్ధి రోహిత్ ఆత్మహత్య చేసుకున్న తరువాత హెచ్సీయూ వివాదాలకు అడ్డాగా మారింది. రోహిత్ ఆత్మహత్యను రాజకీయ నేతలు కూడా తమ స్వలాభానికి వాడుకున్నారు. అయితే గత కొద్ది రోజులుగా హెచ్సీయూలో వాతావరణం కాస్త నెమ్మదించింది కదా అనుకునే లోపే మరో వివాదానికి తెరపడినట్టు ఉంది. యూనివర్శిటీలో ఉన్నట్టుంది ఒక్కసారిగా శివలింగం, నంది, నాగ దేవత విగ్రహం కనపడడం కలకలం రేపుతోంది. దీంతో యూనివర్శిటీలో విగ్రహాలు పెట్టడంపై విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్శిటీలో అంబేద్కర్ విగ్రహం పెట్టడానికే అంగీకరించలేదు.. అలాంటిది ఇలాంటి మత పరమైన విగ్రహాలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒక మతానికి సంబంధించిన భావజాలాలను వేరొకరిపై రుద్దడం భావ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి రాత్రికి రాత్రే విగ్రహాలు ఎవరు పెట్టారో.. ఏ ఉద్దేశ్యంతో పెట్టారో.. దీనిపై ముందు ముందు ఎన్ని గొడవలు జరుగుతాయో చూడాలి.
.jpg)