కాశ్మీర్ లో మళ్ళీ నిలిచిపోయిన ఫోన్ సర్వీసులు...

 

నిన్న మొన్నటి దాకా అల్లకల్లోలంగా ఉన్న కాశ్మీర్ లో ఇప్పుడు కొంత మెరకు ప్రశాంత వాతావరణం నెలకొంది అనే చెప్పుకోవాలి. కాశ్మీర్ లో మొబైళ్లు అందుబాటులోకి వచ్చిన గంటల వ్యవధి లోనే ఎస్ఎంఎస్ సర్వీసులు నిలిపివేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నాం అంటున్నారు అధికారులు. రాజస్థాన్ ట్రక్ డ్రైవర్ ను ఉగ్రవాదుల చంపివేయడంతో సైన్యం అప్రమత్తమైంది. మరోవైపు కాశ్మీర్ లో జన జీవనం సాధారణ స్థితికి వచ్చింది. డెబ్బై రెండు రోజుల తరువాత ఫోన్ లు పని చేస్తున్నాయన్న ఆనందం కశ్మీరీలకూ కొన్ని గంటలు కూడా లేకుండా పోయింది. ఉదయం ఫోన్ ను పునరుద్ధరించిన అధికారులు సాయంత్రానికి ఎస్సెమ్మెస్ ల సర్వీసులు నిలిపేశారు.

రాజస్థాన్ ట్రక్ డ్రైవర్ హత్యతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అటు సరిహద్దుల్లో కూడా సైన్యం నిఘా పెంచింది. చొరబాటుదార్ల కదలికలపై కన్నేసింది. ఆగస్టు ఐదు తర్వాత కశ్మీర్ లో ఫోన్ లు బంద్ చేసిన ప్రభుత్వం సోమవారమే పునరుద్ధరించింది. పోస్ట్ పెయిడ్ మొబైల్ ఫోన్ సర్వీసులు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే మూడు నెలలుగా బిల్లు కట్టలేదనే కారణంగా మొబైల్ ఆపరేటర్లు సర్వీసులు నిలిపేశారు. ఫోన్ లు బంద్ చేసిన కాల్స్ కి కూడా బిల్లులు రావడంతో కాశ్మీరీలు గగ్గోలు పెడుతున్నారు. అటు ప్రీపెయిడ్ మొబైల్ ఫోన్ల పై వచ్చే నెలలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇంటర్నెట్ సర్వీసులు కూడా త్వరలో అందుబాటు లోకి తెస్తామని గవర్నర్ చెబుతున్న అధికారులు మాత్రం రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. అటు కాశ్మీర్ లో సాధారణ జన జీవనానికి ఎలాంటి ఆటంకం లేదని చెబుతున్నారు. ప్రజా రవాణా బాగానే ఉందని, వీధి వ్యాపారాలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. మళ్ళీ ఫోన్ సర్వీసులు కాశ్మీరీ ప్రజలకు ఎప్పుడు చేరువవునున్నాయో వేచి చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu