సీఐపై హిజ్రాల పూల వర్షం.. ఎందుకంటే...
posted on Sep 30, 2021 3:46PM
వారినెవరూ పట్టించుకోరు. వారినెవరూ పనిలో పెట్టుకోరు. వారిని సమాజం గౌరవించదు. పాపం.. అటూఇటూ కాని మనుషులు. అడుక్కోవడం ఒక్కటే వారికి తెలుసు. అదే వారికి ఉపాధి. అలా బిచ్చమెత్తి.. పైసా పైసా కూడబెట్టి.. దాచుకున్నదంగా ఓ దొంగ దోచుకుపోయాడు. ఏళ్ల తరబడి కష్టాన్ని.. ఒక్క రోజులోనే ఎత్తుకెళ్లాడు దొంగ. అనంతపురం జిల్లా విడపనకల్లులో హిజ్రా అనుష్కకు జరిగిందీ అన్యాయం.
హిజ్రా అనుష్క ఇంట్లో జొరబడి.. ఏకంగా 4 లక్షల నగదు.. ఆరున్నర తులాల బంగారాన్ని దొంగతనం చేశాడో దొంగ. దీంతో, స్థానిక హిజ్రాలంతా కలిసి వెళ్లి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు సైతం పాపం అనిపించినట్టుంది. ఎప్పటిలా లైట్ తీసుకోకుండా కేసును సీరియస్‌గా ఇన్వెస్టిగేట్ చేశారు. దొంగను పట్టుకున్నారు. డబ్బు, బంగారం రికవరీ చేశారు. ఆ సొత్తును హిజ్రా అనుష్కకు అందజేశారు.
దొంగను పట్టుకొని.. డబ్బు తిరిగిచ్చినందుకు.. ఉరవకొండ సీఐ శేఖర్‌ను హిజ్రాల సంఘం సన్మానించింది. పూలదండతో సత్కరించింది. సీఐపై పూల వర్షం కురిపించారు హిజ్రాలు. సీఐ పనితీరుకు హిజ్రాలు.. హిజ్రాల సన్మానానికి సీఐ.. ఆల్ హ్యాపీస్.