జగన్ సర్కార్ కి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

అమర్‌రాజా ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ భూముల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలును నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. 

2009లో చిత్తూరులో అమర్‌రాజా ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు 483 ఎకరాలను వైఎస్సార్ ప్రభుత్వం కేటాయించింది. అయితే, వైఎస్సార్ హయాంలో కేటాయించిన 483 ఎకరాల్లో 253 ఎకరాలను వెనక్కి తీసుకునేందుకు ఇటీవల జగన్ సర్కార్ జీవో జారీ చేసింది. ఆ జీవోను సవాల్ చేస్తూ అమర్‌రాజా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ పై నేడు విచారణ జరిపిన హైకోర్టు.. జీవో అమలుపై స్టే ఇచ్చింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu