ఆరోగ్యంగా ఉండాలంటే!!

ఆధునిక దీర్ఘ కాలిక వ్యాధులను నయం చేయటానికి వ్యాధులను నయం చేయడానికి ఆరోగ్యం గా ఉండాలంటే,వ్యాధి నిరోధక శక్తికి ఆహార నియమాలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు అంటున్నారు నిపుణులు ఆస్ట్రేలియన్ హెర్బల్  మెడిసిన్ కు చెందిన డాక్టర్ గుత్త లక్ష్మణ్ రావు.అసలు మనం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే సరైన ఆహార క్రమశిక్షణ తోనే సాధ్యం అని అంటున్నారు. ముఖ్యంగా శరీరాన్ని పట్టి పీడించే డయాబెటిస్,హై బిపి,గుండెసమస్యలు,  అలసట, నీరసం,త్వరగా అలిసిపోవడం వంటి  సమస్యలకు ప్రధాన కారణం శరీరానికి సరైన పోషకాలు అందక పోవడమే అని అంటున్నారు డాక్టర్ జి లక్ష్మణ్ రావు. ఇటీవల కాలం లో డాక్టర్ లక్ష్మణ్ రావు గారి నేతృత్వం లోని బృందం సమీకృత ఆహారం ఆరోగ్యం అన్న అంశం పై చేసిన పరిశోదన వివరలాను తెలుగు వన్ హెల్త్ కు వివరించారుమనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన ఆహార పదార్ధాలు ఏమిటి?.

సంక్లిష్ట పిండి పదార్ధాలు...

సంక్లిష్ట పిండి పదార్ధాలు అంటే తవుడు తీయని బియ్యము తవుడు తియ్యని ముడి బియ్యము అంటే పోలిష్ చేయనిముడి  బియ్యము.తినాలి.గోధుమలు మీరే పిండి మర పట్టించి,జల్లెడ పట్టని గోధుమ పిండితో నూనెలేని పుల్కాలు ,రోటీలు చపాతీలు,చేసుకుని తినండి.

బహు ధాన్యాలపిండి...

గోధుమలు౩ కిలోలు,పచ్చ జొన్నలు,అరకిలో రాగులు,అరకిలో సజ్జలు అన్ని కలిపి పిండి పట్టించి జల్లెడ పట్టకుండా పుల్కాలు రోటీలు,చపాతీలు చేసుకోవచ్చు. పై మూడు రకాలు ప్రతి భోజనం లో ఉండాల్సిన అవసరం లేదు.ఒక్కో భోజనం లో ఒక్కో రకం వాడవచ్చు.

కాయ కూరలు,ఆకు కూరలు...

ప్రతి భోజనం లో ఒక కూర,ఒక ఆకు కూర ఉంటె మంచిది.మీరు ఆకు కూరలో పప్పు తినే అలవాటు ఉంటె మంచిది.

మాంస కృ త్తులు...

అంటే జంతు సంభంద మాంసకృత్తులకు బదులు శాఖా హారులు పప్పులను గింజలను వాడతారు.కంది పప్పు,పెసరపప్పు,సోయా పప్పు,గింజలను వాడతారు. కంది పప్పు,పెసర పప్పు,శెనగ పప్పు,ఉలవపప్పు,బటానీ పప్పు,కేసరి పప్పు,సోయా పప్పు,ఇలాంటివి జంతు సంబంధిత మాంస కృత్తులు కన్నా వీటిని జీర్ణించుకోవడం కష్టం.అజీర్తి గ్యాస్,ఎసిడిటి,కడుపు ఉబ్బరం,మల బద్ధకం,హేమరాయిడ్స్,పైల్స్,వంటి సమస్యలు ఉన్నవారికి ఏ రకమైన పప్పూ,పప్పులతో చేసిన పదార్ధాలు పనికి రావు.పరిస్థితులు మరింత దిగజారుస్తాయి.లేదా తీవ్రతర మౌతాయి,రోగి పరిస్థితిని బట్టి వైద్యుడు వీటి వాడకం తగ్గించమానో,పూర్తిగా వదిలివేయమానో చెప్పవచ్చు.

ఊరాగాయ పచ్చళ్ళు...

ఊరగాయపచ్చడి లేనిదే ఒక్క ముద్దకూడా దిగని తెలుగు వాళ్ళు లేరంటే ఆశ్చర్యం లేదు వీటి వాడకం తెలుగు ప్రజలలో ముఖ్యంగా కోస్తజిల్లాలలో విస్తారంగా పచ్చళ్ళు వినియోగిస్తారు.వీటిలో వేసే కారం కన్నా అధిక మోతాదులో వాడే ఉప్పు నూనె ఆరోగ్యానికి చాలా హానికరమైన పదార్ధాలు ,ఎండు మిరపకాయల కారం లో చాలా శక్తి వంత మైన ఔషద గుణాలు ఉన్నాయి.అయితే మిరప కయాల్ కారం లో మనం కలిపే ఉప్పు నూనె తదితర మసాలాలు దానిలోని ఔషద గుణాలు తటస్థం చేయడమే కాక మన గుండె రక్త నాళాల వ్యవస్థకు,కీళ్ళకు గణనీయం గా హాని కలిగిస్తాయి ఊర గాయ పచ్చళ్ళ ను ఎంత తక్కువగా వాడితే అంత మంచిది.

పండ్ల రసాలు ....

ఉదయము,మాధ్యాహ్నము,రాత్రి కూడా భోజనానికి 15 నిమిషాలు ముందు ఒక చిన్న గ్లాసు పండ్ల రసం తాగడం మంచిది.చాలా మందికి ఇది తప్పనిసరి.

పండ్లు...

ఉదయం భోజనానికి మధ్య భోజనానికి మధ్య,భోజనానికి మధ్య ,మాధ్యాహ్నం భోజనానికి రాత్రి భోజనానికి మధ్య పండు తినడం మంచిది.రోజూ ఒకే రకమైన పండు తినడం మంచిది.కాదు.ఒక్కో రకం పండ్లలో ఒకో రకం పోషకాలు ఉంటాయి.ఎన్ని రకాల పండ్లు తింటే అన్ని రకాల పోషకాలు శరీరానికి అందుతాయి.

ఎండిన పండ్లు,పప్పులు...

వీటిలో ఖనిజాలు,మాంస కృత్యాలు,తీపి పదార్ధాలు,విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.ప్రతిరోజు వీటిని ఒక యాభై గ్రాములు తింటే మన జీర్ణ శక్తికి జీవన ప్రక్రియకు గ్రంధులు సమర్ధవంతంగా పనిచేయడానికి ఉపయోగ పడతాయి.

గింజలు మొలకలు...

గింజలలో కన్నా గింజల మొలకలలో మనకు ఉపయోగ పడే పోషకాలు అనేకరెట్లు ఎక్కువగా ఉంటాయి. అవి మనకు తేలికగా జీర్ణం అవుతాయి.మనం జీర్ణించుకున్న ఆహారం వేడిగా ను శక్తిగాను మార్చడానికి ఉపయోగపడతాయి.మొలకలలో ని పోషకపదార్ధాలు మనకు పూర్తిగా ఉపయోగ పడాలంటే మొలక నుండి వేరు ఒకటి,ఒకటి న్నార అంగుళం పొడవు పెరగాలి ఒకటి రెండు ఆకులు బయటికి వచ్చి ఆకు పచ్చరంగు కు మారాలి అలాంటి మొలకలనే తినాలి.

పెర్మెంటెడ్ ఫుడ్స్...

ఆంగ్లం లో మనము పెర్మెంటెడ్ ఫుడ్ అని పిలవబడే ఆహారపదార్ధలాను మనం తెలుగులో పులవ పెట్టిన ఆహార పదార్ధాలని చెప్పుకోవచ్చు.పెరుగు మజ్జిగ ఇలాంటివే వీటిలో ఉన్న కొన్ని సూక్ష్మ జీవులు సహజ ప్రక్రియ వల్ల పోషక విలువలు పెరుగుతాయి.తేలికగా జీర్ణం అవుతాయి.

అత్యవసర కొవ్వు సంబంధిత ఆమ్లాలు...

మన అర్రోగ్యం పటిష్టతకు కొవ్వు పదార్ధాలు అవసరం అయితే వాటిని అధికమోతాదులో వాడడం మన ఆరోగ్యానికి హానికరం అత్యవసర కొవ్వు సంబంధిత అమ్లాలలో ఒమేగా౩ ముఖ్యమైనది ఇది మన ఆహారం లో సరిపడా ఉండడం లేదు.ఇది అవిసగింజలలో ఫ్లాక్స్ సీడ్స్ లో పుష్కలంగా ఉంటాయి భోజనం కాగానే ఒక టేబుల్ స్పూన్ అవిశ గింజలు నమిలి తింటే ఆరోగ్యానికి మంచిది.

పంచదారకు బదులు నల్ల బెల్లం...

తెల్లని పంచదారలో కేవలం కేలరీలు తప్ప మరే ఇతర ప్రాధాన పోషక పదార్ధాలను గాని అధికంగా తినడం ఆరోగ్యానికి చాలా హానికరం అను అంటున్నారు ఆస్ట్రేలియన్ హెర్బల్ మెడిసిన్ కు చెందిన వైద్యులు డాక్టర్ జి లక్ష్మణ్ రావు గారు.చెరుకు పట్టించిన బెల్లం లో అనేక రకాల సూక్ష్మ పోషకపదార్ధాలు ఉనాయి.ఆరోగ్యానికి తేనె మంచిదని పరిశోధకులు చెపుతున్నారు.పంచదారకు బదులుగా నల్ల బెల్లం వాడడం మంచిదని సెలవిచారు.

సముద్రపు ఉప్పు సైంధవ లవణం...

నీటిలో ఉన్న ఖనిజాల పోషకాల విషయం లో సముద్రపు ఉప్పుకు ఇతర ఉప్పులకన్న చవక,అయితే దానిలో కొంచం చెమ్మ ఎక్కువగా ఉండడం తో సముద్రపు ఉప్పులో 84 రకాల ఖనిజాలు ఉన్నాయి మన రక్తం లో కూడా ఖనిజాలె ఆనిష్పత్తిలో ఉంటాయి.అవి మన గ్రంధులకు అవసరం మితంగా వాడినప్పుడు సముద్రపు ఉప్పు హై బ్లడ్ ప్రెషర్ కు దారి తీయదు.అని వంటకాల లోనూ సముద్రపు ఉప్పును వాడడం మంచిది.

మంచి నీళ్ళు...

ప్రతి రెండు గంటలకు ఒక గ్లాసు నీళ్ళు మన శరీరం లోని వ్యర్ధ పదార్ధాలను బహిష్కరించడానికి మన దేహంలో జరగాల్సిన అన్ని సహజ ప్రక్రియలకు అవసరమైన నీటిని అందించడానికి ఉపయోగ పడుతుంది.

తిన కూడని పదార్ధాలు...

తెల్లనిబియ్యము,తెల్లని గోధుమ పిండి,తెల్లని మల్టి గ్రెయిన్ పిండి,పంచదార. అన్నిరకాల తీపి పదార్ధాలు వేపుడు వంటకాలు.దుకాణాల లో అమ్మే తినుబండారాలు.మానడం మంచిది.మాంసం, గుడ్లు,చేపలు,రొయ్యలు,అన్నిరకాల పప్పులు పప్పులతో చేసిన వంటకాలు.రీఫైండ్ ఉప్పు,మసాలాలు,ఊరగాయ పచ్చళ్ళు,కాఫీ టీ,కూల్డ్రింక్స్. 

బౌతిక శ్వాస వ్యాయామం...

ప్రతిరోజూ నడక,శ్వాస వ్యాయామం,భౌతిక వ్యాయామం అందరికీ అవసరం.ఎవయస్సులో ఉన్నవారైనా వ్యాయామం చేయడం అవసరం.

రోజూ మన ఆహారం ఎలా ఉండాలి...

ఉదయం పళ్ళు తోముకోగానే ఒకగ్లాసు క్యారెట్ జ్యూస్,బీట్ రూట్ జ్యుసే,మంచినీళ్ళు,ఉదయం అల్పాహారం,ఒక గ్లాసు పండ్లు,లేదా కాయ గూర,లేదా ఆకు కూర రసం, జల్లెడ పట్టని చిరు ధాన్యాలు,తృణ ధాన్యాల పిండితో నూనె లేకుండా కాల్చిన పుల్కాలు,కాయకూరల,ఆకుకూరల వేపుడు చేయని కూర,ఒక గ్లాసు చిక్కటి మజ్జిగ, ఒక కప్పు మీగడ లేని పెరుగు.అల్పాహారానికి,మాధ్యాహ్న భోజనానికి మద్ష్య మీఅకలిని బట్టి ఒకటి గాని రెండుకాని రకరకాల పండ్లు,తీసుకోవడం మంచిది.

మాధ్యాహ్న భోజనం...

ఒకగ్లాసు పండ్ల రసం,ముడి బియ్యం తో గంజి వార్చని అన్నం,ఒక కాయకూర,ఒక ఆకు కూరపప్పుఒక గ్లాసు చిక్కటి మజ్జిగ,ఒకకప్పు మీగడ లేని పెరుగు.ఫ్రూట్ సలాడ్,వేగితబుల్ సలాడ్,కాని తీసుకుంటే మంచిదని నిపునులు సూచిస్తున్నారు.

మాధ్యాహ్న భోజనానికి,రాత్రి భోజనానికి మధ్య...

మీ ఆకలిని బట్టి,ఒకటి లేదా రెండు రకాలపండ్లు,సాయంత్రం అయిదు గంటల మాధ్య ఒక యాభై గ్రాముల ఎండు పండ్లు,పప్పులు నట్స్ తీసుకోవడం మంచిది.

రాత్రి భోజనం...

ఒక గ్లాసు పండ్ల రసం ,మాధ్యాహ్న భోజనం కన్నా రాత్రి భోజనం తక్కువగాను,తేలికగానూ జీర్ణ మయ్యేవిధంగా జల్లెడ పట్టని మల్టి గ్రైన్  ఆటాతో చేసినపుల్కాలు కాయ కూర,లేదా ఆకు కూర,ఒక గ్లాసు మజ్జిగ,లేదా పెరుగు నిద్ర పోయే ముందుఒక కప్పు పాలు లేకుండా గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ ఇది గాఢ నిద్ర పట్టేందుకు సహక రిస్తుంది.