విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే?

 

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండపై హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసు స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గిరిజనులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆయనపై గిరిజన సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాక్ మీద ఇండియా ఎటాక్ చేయాల్సిన పనే లేదని.. అక్కడి ప్రజలకు విరక్తి వచ్చి వాళ్ల ప్రభుత్వం వాళ్లే మీద ఎటాక్ చేస్తారన్నారు.

కరెంట్, నీళ్లు లేకుండా ఆ దేశంలో పరిస్థితులు ఇదే విధంగా కంటిన్యూ అయితే..500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా, పని లేకుండా కొట్లాడుతారన్నారు. మనమంతా సమష్టిగా కలిసి ఉండాలి’ అని అన్నారు. విజయ్‌ దేవరకొండ ఆదివాసులను అవమానించేలా మాట్లాడారని ట్రైబల్స్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ బాపూనగర్‌ అధ్యక్షుడు కిషన్‌రాజ్‌ చౌహాన్‌ కిషన్ సహా గిరిజన సంఘాలు తప్పుబట్టాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu