ఏపీ సీఎం చంద్రబాబుతో నాగార్జున భేటీ.. ఎందుకంటే?
posted on Jun 3, 2025 2:17PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో హీరో నాగార్జున భేటీ అయ్యారు. ఈ ఇరువురి భేటీ ఇరు రాష్ట్రాలలోనూ ప్రాధాన్యత సంతరించుకుంది. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబునాయుడిని హీరో నాగార్జున మంగళవారం (జూన్ 3) కలిశారు.
ఈ సందర్భంగా ఇరువురి మధ్యా ఏం చర్చ జరిగిందన్న దానిపై పలు ఊహాగాన సభలు ఆరంభమైపోయాయి. అయితే నాగార్జున సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యింది తన చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ వివాహానికి ఆయనను ఆహ్వానించడానికే. అక్కినేని అఖిల్ వివాహం అన్నపూర్ణా స్టూడియోస్ లో ఈ నెల 6న జరగనుంది. తన కుమారుడు, యువ హీరో అక్కినేని అఖిల్ వివాహానికి హాజరుకావాల్సిందిగా నాగార్జున సీఎం చంద్రబాబును ఆహ్వానించి, శుభలేఖ అందజేశారు. వివాహానికి హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆయన వ్యక్తిగతంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు నాగార్జున అందజేశారు.