హేమమాలినిపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..రోజూ తాగుతారు..
posted on Apr 14, 2017 12:14PM
.jpg)
ఈ మద్య రాజకీయ నేతలు తరచూ వివాదాస్ప ద వ్యాఖ్యలు చేస్తూ అడ్డంగా బుక్కవుతున్నారు. ఇప్పుడు మహారాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్యే బచ్చుకదు కూడా హేమమాలినిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆత్మహత్యలపై ఆయన మాట్లాడుతూ...కేవలం మద్యం తాగుడుకు అలవాటు పడటం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. అంతేకాదు అక్కడితో ఆగకుండా..ఎమ్మెల్యేల్లో 75 శాతం మంది రోజూ మందు కొట్టేవారేనని, పాత్రికేయుల్లో అత్యధికులు మద్యం సేవిస్తారని.. అంతెందుకు, నటి హేమమాలిని రోజూ మద్యం తాగుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లంతా ఆత్మహత్యలు చేసుకుంటున్నారా? అని బచ్చుకదు ప్రశ్నించారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్సలు తలెత్తుతున్నాయి.