ఆర్టిస్ట్ హేమ దారుణ హత్య

 

ముంబైకి చెందిన ప్రముఖ చిత్రకారిణి హేమ ఉపాధ్యాయ్ దారుణ హత్యకు గురయ్యారు. ఖాండివలి ప్రాంతంలో మురుగు కాల్వలో పడేసిన ఓ కార్డుబోర్డు పెట్టెలో హేమా ఉపాధ్యాయ్‌తోపాటు ఆమె లాయర్ మృతదేహాలను పోలీసులు గుర్తించారు. హేమ ఉపాధ్యాయ్ ప్రముఖ చిత్రకారుడు చింతన్ ఉపాధ్యాయ్ భార్య. ఈ దంపతుల మధ్య గత కొంతకాలంగా విభేదాలు నెలకొన్నాయి. 2013 సంవత్సరంలో హేమ తన భర్త మీద వేధింపుల కేసు పెట్టింది. ఈ కేసును హర్ష్ భంబాని అనే న్యాయవాది వాదిస్తున్నారు. ఇప్పుడు హేమతోపాటు ఆమె లాయర్ కూడా హత్యకు గురికావడంతో పోలీసులు చింతన్ ఉపాధ్యాయ్ కోసం గాలిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu