మోహన్ బాబు బెయిల్ పిటిషన్ 19న విచారణ
posted on Dec 14, 2024 3:44PM
జర్నలిస్ట్ పై దాడి కేసులో నటుడు మోహన్ బాబుపై పహాడీషరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తనను అరెస్ట్ చేస్తారన్న సమాచారంతో మోహన్ బాబు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ దరఖాస్తు చేసుకున్నారు. శనివారం ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది 19 తేదీ విచారణలో తేలనుంది.
గత వారం రోజుల నుంచి మోహన్ బాబు ఇంట్లో గొడవల నేపథ్యంలో శనివారం పోలీసులు విచారణ చేపట్టాలని నిర్ణయించారు. జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసంలో కొడుకుతో జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఒకరినొకరు కేసులు నమోదు చేసుకున్నారు. జర్నలిస్ట్ పై దాడి జరగడంతో పహాడీ షరీఫ్ పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాత పోలీసులకు సహకరిస్తానని మోహన్ బాబు పోలీసులకు చెప్పినట్టు సమాచారం.