పచ్చిమిర్చి జ్యూస్ తాగితే జరిగే మ్యాజిక్ ఇదే..

షడ్రుచులలో కారానికి కూడా ప్రాధాన్యత ఉంది.  అకార, ఉకార, మకారాలు కలిస్తే ఓంకారం అయినట్టు. ఉఫ్ ఉఫ్ మని ఉకారంతో  నోరు ఊదుకుంటే అది కారం అవుతుంది. కారానికి కేరాఫ్ అడ్రస్ గా పచ్చిమిర్చి నిలుస్తుంది.  పచ్చిమిర్చి ప్రపంచదేశాలలో కారం కోసం ఉపయోగించే కూరగాయ.  అయితే ఇది భారతదేశంలో చాలా విస్తారంగా వాడబడుతుంది. పచ్చిమిర్చిని కూరల్లో, స్నాక్స్ లో విరివిగా ఉపయోగిస్తారు. అయితే పచ్చిమిరపకాయతో జ్యూస్ చేస్తారని, ఈ జ్యూస్ ను తాగడం వల్ల ఆరోగ్యానికి పెద్ద మ్యాజిక్కే జరుగుతుందని అంటున్నారు. ఇంతకీ ఈ మిరపకాయ జ్యూస్ కథేంటో తెలుసుకుంటే..

పచ్చిమిర్చి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా, ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు మొదలైన వాటి వల్ల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పచ్చిమిర్చిని మధ్యగా కట్ చేసి, కాసింత పంచదార, పుదీన, నిమ్మరసంతో కలిపి బాగా షేక్ చేసి జ్యూస్ తయారుచేసుకోవాలి. దీన్ని తీసుకుంటే బోలెడు ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి. పచ్చిమిర్చిలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఈ జ్యూస్ లో నిమ్మరసం, పుదీనా కూడా వాడటం  వల్ల ఇమ్యూనిటీ మరింత ఎక్కువగా ఉంటుంది. దీన్ని రోజులో సాయంత్రం సమయంలో టీ కాఫీ లాంటి పానీయాల స్థానంలో తీసుకుని శరీరానికి ఎంతో ఉల్లాసంగా ఉంటుంది.

పచ్చిమిర్చి చేర్చిన ఈ జ్యూస్ తీసుకుంటే బరువు తగ్గడం కూడా సులువు. ఇందులో క్యాప్సైసిన్ అనే రసాయం ఉంటుంది.  ఇది జీవక్రియను పెంచుతుంది, బరువును అదుపులో ఉంచుతుంది. పచ్చి మిర్చిలో పొటాషియం, విటమిన్ ఎ మరియు కాల్షియం ఉంటాయి, ఇవి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే నరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. పచ్చిమిరపకాయల్లో మంచి మొత్తంలో పొటాషియం, ఫైబర ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.  అందుకే  అప్పుడప్పుడైనా ఈ పచ్చిమిర్చి జ్యూస్ ను తాగుతూ ఉండటం రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. 

                                                                         *నిశ్శబ్ద.