విజయవాడలో బయటపడ్డ భారీ హవాలా కుంభకోణం
posted on May 17, 2017 3:07PM

కొద్ది రోజుల క్రితం విశాఖపట్నాన్ని ఒక కుదుపు కుదిపిన 1500 కోట్ల భారీ హవాలా కుంభకోణం ఘటనను మరవకముందే ఏపీ పరిపాలనా రాజధాని విజయవాడలో మరో కుంభకోణం బయటపడింది. నగరంలోని హెల్ప్ ఆసుపత్రి ఎండీ చలపాటి రవి, టైమ్ హస్పటల్ ఎండీ మైనేని హేమంత్‌లు విదేశాలకు బ్లాక్ మనీని వివిధ మార్గాల్లో పంపి, ఆ డబ్బును హవాలా మార్గంలో విజయవాడకు తిరిగి రప్పించుకుంటున్నారు. వారికి బ్రహ్మాజీ అనే ఏజెంట్ ఈ పని చేసి పెడుతూ ఉండేవాడు..అయితే ఈ మధ్య కాలంలో విదేశాల నుంచి వచ్చిన డబ్బును బ్రహ్మాజీ సకాలంలో అందజేయలేదు. దీంతో అతనిని కిడ్నాప్ చేసి చిత్ర హింసలకు గురిచేశారు. అనంతరం పోలీసులను రంగంలోకి దించి కేసును సెటిల్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ మొత్తం వ్యవహారం బట్టబయలు కావడంతో సీపీ గౌతమ్ సవాంగ్ సదరు పోలీసులను విధుల నుంచి తప్పించారు.