తెలంగాణ పై మోసం చేశారు

 

 

harishrao telangana, cm kiran telangana, telangana issue, cm kiran kumar reddy telanagana

 

 

శాసనసభలో శనివారం మరోసారి టీఆర్ఎస్ నేత హరీష్‌రావు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని, 2004 కంటే ముందు కాంగ్రెస్ తెలంగాణ ఇస్తామని నమ్మించి మోసం చేసిందని హరీష్‌రావు విమర్శించారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ సమస్యను పరిష్కరించాలని, సభలో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

 

దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ప్రత్యేక తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రాంతాల వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అంశం జఠిలమైనదని, కేంద్రం నుంచి నిర్ణయం వచ్చే వరకు వేచి ఉండాలని, కేంద్రం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu