పంచాయతీ ఫలితాలపై స్పందించిన హరికృష్ణ

 

 harikrishna panchayat results, panchayat election TDP

 

 

పంచాయతీ ఎన్నికల ఫలితాలపై టిడిపి రాజ్యసభ సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్.కుమారుడు నందమూరి హరికృష్ణ స్పందించారు. మూడు విడతల్లో వచ్చిన ఫలితాలను విశ్లేషిస్తే ప్రజలు టిడిపి వైపే వున్నారని అర్థమవుతుందని అన్నారు. టిడిపి పార్టీకి అత్యధిక స్థానాల్లో విజయాన్ని అందించినందుకు ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ అవినీతిని, కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానన్ని ప్రజలు తిరస్కరించారన్నారు. మూడు దశల పంచాయతీ ఎన్నికల ఫలితాలు కలిపి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మద్దతుదారులు కొద్ది తేడాతో ఆరువేల పంచాయతీల్లో గెలుపొందారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu