ఏపీ మద్యం స్కామ్‌లో బీజేపీ జీవీఎల్ పాత్ర!
posted on Jul 26, 2024 12:05PM
ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్‌లో భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పాత్ర వున్నట్టు తెలుస్తోంది. జగన్ పార్టీలోని ఒక మాజీ ఎంపీతో కలసి జీవీఎల్ నరసింహారావు మద్యం స్కామ్‌కి పాల్పడినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జీవీఎల్ నరసింహారావు బ్యాంకు లావాదేవీల మీద సీఐడీ అధికారులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సుమారు 40 కోట్ల రూపాయలు జీవీఎల్ నరసింహారావు ఖాతాలో చేరినట్టు సమాచారం. జీవీఎల్ నరసింహారావుకు వైఎస్సార్సీపీతో సీక్రెట్ సంబంధాలు వున్నాయి. అందుకే గత ఎన్నికలలో బీజేపీ నుంచి ఆయన టిక్కెట్ ఆశించినప్పటికీ పార్టీ నాయకత్వం ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ తులసి వనంలో గంజాయి మొక్కతో పోల్చదగ్గ నాయకుడిగా జీవీఎల్ నరసింహారావును భావిస్తారు. 2014లో ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన సమయంలో నరేంద్ర మోడీ, చంద్రబాబు మధ్య అంతరం పెరగడానికి జీవీఎల్ నరసింహారావు వ్యవహారశైలే ప్రధాన కారణంగా చెబుతూ వుంటారు. వైసీపీతో రహస్య సంబంధాల కారణంగానే జీవీఎల్ అప్పట్లో అలా వ్యవహరించి వుంటారన్న అనుమానాలు కూడా వున్నాయి. మొత్తమ్మీద జీవీఎల్ నరసింహారావు మీద బీజేపీ నాయకత్వానికి నమ్మకం పోవడం వల్లే ఆయన్నీ దూరం పెడుతూ వస్తోంది. ఇప్పుడు లిక్కర్ స్కామ్‌లో కూడా ఈయన పాత్ర వుందని తెలుస్తున్న నేపథ్యంలో ఆయన భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.