గుర్మీత్ కాంపౌండ్‌లో మగాళ్లు అమ్మాయిలను చూస్తే
posted on Sep 22, 2017 11:26AM
.jpg)
ఇద్దరు మహిళా సాధ్వీలపై ఆత్యాచారానికి పాల్పడి ప్రస్తుతం రోహ్‌తక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్ఛా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ బాబా ఆకృత్యాలు రోజుకోకటి వెలుగు చూస్తున్నాయి. మొదటి నుంచి గుర్మీత్ కామాంధుడు అన్న సంగతి తెలిసిందే. మహిళలతో అత్యంత సన్నిహితంగా మెలిగే డేరా బాబా..ఆశ్రమంలోని మగాళ్ల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించేవాడట..ఈ విషయాన్ని అతని మాజీ అనుచరుడు గుర్‌దాస్ సింగ్ తూర్ వెల్లడించాడు. ఆశ్రమంలో మగవాళ్లకు చాలా కఠిన నియమాలు ఉండేవి. మహిళా భక్తులతో ఎవరూ మాట్లాడకూడదు..ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనను అతిక్రమించి మాట్లాడితే శిక్షలు కఠినంగా ఉండేవట..గాడిదల మీద ఉరేగించడం..ప్రజల సమక్షంలోనే అనుచరులతో కొట్టించేవాడు..వాటికి భయపడే చాలా మంది మహిళా సాధ్వీలతో మాట్లాడటానికే భయపడేవారని వారు చెబుతున్నారు. వీటి ప్రభావంతో ఎంతో మంది మగాళ్లు స్వలింగ సంపర్కులుగా మారిపోయారట.