పత్తిపాడు కాంగ్రెస్ టిక్కెట్ కు పెరిగిన డిమాండ్
posted on Mar 24, 2012 12:07PM
గుంటూరుజిల్లా పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కు హఠాత్తుగా డిమాండ్ పెరిగింది. నిన్నమొన్నటి వరకు పోటీ చేయడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడ ఈ టిక్కెట్ కోసం గుంటూరుజిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ కూచిపూడి విజయ, పాత్తూరి రామకృష్ణ, టిజెఆర్ సుధాకర్ బాబు తదితరులు పోటీపడుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఈ ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇక్కడ పోటీకి వీరు ఆసక్తి చూపిస్తున్నారు. టిక్కెట్ తెచ్చుకుంటే గెలిపించే బాధ్యతను కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, పార్లమెంట్ సభులే చూసుకుంటారన్న ధీమాతో వారు ఉన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు కన్నా, మోపిదేవి, కాసు, డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎంపిలు రాయపాటి, జెడి శీలం, కేంద్ర మంత్రి పసబాక, ఎమ్మెల్సీ లు రాయపాటి శ్రీనివాస్, సంఘం బసవ పున్నయ్య, ఇవిజెకె కృష్ణారెడ్డి తదితర హేమాహేమీలు పత్తిపాడు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో పలువురు కాంగ్రెస్ నాయకులు ఇక్కడ పోటీ చేయటానికి ఆసక్తి చూపుతున్నారు.