'గుండెల్లో గోదారి' సినిమా హైలైట్స్
posted on Mar 8, 2013 4:48PM
.jpg)
'గుండెల్లో గోదారి' సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైన విడుదల మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ, ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. ఈ చిత్రం పై భారీ అంచనాలు లేకపోయినా, ఇళయరాజా మ్యూజిక్, గోదావరి నేపథ్యంలో సాగే చిత్రమని చెప్పడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. 'గుండెల్లో గోదారి' మూవీ హైలైట్స్ మీ కోసం:
సినిమా ఆర౦భంలో వచ్చే వరద సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. రవిరాజ పినిశెట్టి తనయుడు ఆదిపినిశెట్టి యాక్టింగ్ చాల సహజంగా ఉంది. తాప్సీ, ఆదిపినిశెట్టి మధ్య సాగే లవ్ ట్రాక్ ఆకట్టుకొంటుంది. ఇళయరాజా సంగీతం సినిమాకి మెయిన్ హైలైట్ గా చెప్పవచ్చు. సినిమాటోగ్రాఫి, నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. డైరెక్టర్ కుమార్ నాగేంద్ర మూస ఫార్ములా జోలికి పోకుండా విభిన్నమైన ప్రయత్నం చేశారు.