ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈశ్వరయ్య

 

ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జుల ఈశ్వరయ్య ఎన్నికయ్యారు. చండీగఢ్‌లో జరిగిన సీపీఐ జాతీయ మహాసభల్లో కె.రామకృష్ణ స్ధానంలో  కార్యదర్శిగా ఎన్నుకున్నారు. తొలుత విశాఖకు చెందిన జేవీవీ సత్యనారాయణమూర్తికి పార్టీ పగ్గాలు అప్పగించాలని భావించిన తరువాత అధిష్టానం నిర్ణయం విరమించుకుంది.  వైఎస్‌ఆర్ కడప జిల్లాకు చెందిన ఈశ్వరయ్య ఎఐవైఎఫ్, ఎఐఎస్ఎఫ్ విభాగంలో క్రియాశీలకంగా పని చేశారు. కడప జిల్లాలో కార్మికులు, రైతుల సమస్యలపై ఆయన చేసిన పోరాటాలు, నిర్వహించిన ఆందోళనలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

క్షేత్రస్థాయిలో ఆయనకున్న అనుభవం, క్రియాశీలత ఈ పదవికి ఎంపికవడంలో కీలక పాత్ర పోషించాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈశ్వరయ్య నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేసి, రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై పోరాటాలను ఉద్ధృతం చేస్తామని సీపీఐ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈశ్వరయ్య ఎన్నో‌ పోరాటాల్లో కీలకంగా వ్యవహరించారు. రామకృష్ణ, ఈశ్వరయ్యకు నా అభినందనలు. ప్రజల కోసం, ప్రజల పక్షాన మా పోరాటం కొనసాగుతుంది. అని జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu