సేవ అంటే ఇదే...గర్భిణిని ఆసుపత్రికి మోసుకెళ్లిన జవాన్
posted on Apr 21, 2022 7:25AM
పురుటి నెప్పులతో బాధపడుతున్న ఓ మహిళను మంచంపై ఉంచి కిలోమీటర్ల దూరం మోసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చిందామె.మానవ సేవే మాధవ సేవ అంటారు. మానవ సేవ చేసేవారిని మనుషుల్లోనే మహాను భావులుగా అభివర్ణిస్తుంటాం. అయితే ఇటీవలి కాలంలో అటువంటి మానవతా విలువల కోసం కాగడా పట్టి వెతకాల్సి వస్తున్నది. ఓట్ల కోసం వచ్చే రాజకీయ నేతలు ప్రజా సేవ కోసమే రాజకీయాలలోకి వచ్చామని చెబుతుంటారు. అయితే అటువంటి వారి సేవ అంతా రాజకీయ ప్రయోజనాలతోనే ముడి పడి ఉంటుంది.
ఏజెన్సీ ప్రాంతాలలో ఇప్పటికీ కనీస సౌకర్యాలకు కరవే అంటే అందుకు కారణం ప్రజలకు మేలు జరిగే సేవ చేద్దామన్న ఉద్దేశం కానీ, చేయాలన్న సంకల్పం కానీ ‘రాజకీయ’ నేతలలో లేకపోవడమే. అయితే సామాన్యులలో సేవాతత్పరత ఇంకా ఉందనడానికి నిదర్శనమే ఈ ఘటన.
చత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో బుధవారం ఓ గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. జిల్లారిజర్వ్ గార్డ్ ఫోర్స్ జవాన్ వారికి సహాయం చేశారు. గ్రామస్థులతో కలిసి ఆయన దంతేవాడలో ఉన్న
ఆస్పత్రికి చేరుకోవడానికి ఒక గర్భిణీని మంచం మీద వెూసుకెళ్లారు. గ్రామంలోని అడవి బాటలో ప్రయాణిస్తూ ఆరు కిలో మీటర్లు వెూసుకుని తీసుకెళ్లారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి ఆమెకు వైద్యం అందేలా చేశారు. సామాజిక మాధ్యమంలో ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లకు కదిలించింది. ఆ జవాన్ సేవాతత్పరతను కొనియాడుతూ లైక్ లూ, షేర్లతో ప్రస్తుతం ్రటెండింగ్ లో ఉంది. సేవ అంటే ఇదీ...సేవాతత్పరత అనేది ఇలా ఉండాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.