తనని తానే పెళ్ళాడిన భామ
posted on Oct 6, 2014 3:30PM

ఎవర్ని వాళ్ళు పెళ్ళి చేసుకుంటే ఎలా వుంటుంది? చాలా వింతగా వుంటుంది కదూ? అలాంటి వింతపనిని లండన్‌కి చెందిన ఓ ముద్దుగుమ్మ చేసింది. ఆమె పేరు గ్రేస్ గెల్డర్. తనను తాను పెళ్ళాడే ఈ కార్యక్రమానికి బోలెడంత మంది అతిథులు కూడా హాజరయ్యారు. ఇప్పటికి మూడు పెళ్ళిళ్ళు చేసుకుని విడాకులు ఇచ్చేసిన గ్రేస్ గెల్డర్ ఈసారి ఎవర్నో పెళ్ళి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇవ్వడం ఎందుకని అనుకుందో ఏమోగానీ, తనను తాను పెళ్ళి చేసేసుకుంది. ఓ పార్క్‌లో తనకు తానే లవ్ ప్రపోజల్ ఇచ్చుకుంది. ఆ ప్రేమని తానే ఓకే చేసింది. చివరికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి తన వేలికి తానే రింగ్ తొడుక్కుని పెళ్ళి చేసేసుకుంది. పెళ్ళి తర్వాత ముద్దు పెట్టుకోవాలి కదా.. ఆ ముద్దు కూడా అద్దంలో తనకు తానే పెట్టేసుకుని ఆ ముచ్చట కూడా తీర్చేసుకుంది. ఈ పెళ్ళికి చట్ట బద్ధమైన గుర్తింపు ఉండకపోయినప్పటికీ తాను మాత్రం తనను తాను పెళ్ళి చేసుకున్నానని, తన దృష్టిలో తాను వివాహితనేనని ఆమె అంటోంది.