మీ మొహాలు మండ.. గవర్నర్ ఫోనూ ట్యాప్ చేశారా?

ఈ ఫోన్ ట్యాపింగ్ పిశాచాల పిండాలు పిచ్చుకలకు వేసినా పాపం లేదు. ఈ వేస్టుగాళ్ళు చేసిందే నీచ నికృష్టమైన పని. దాంట్లో కూడా పరిధులు దాటిపోయి ఎంత దారుణానికి దిగారనేది తెలుస్తుంటే రక్తం మరిగిపోతోంది. రాజకీయ కారణాలతో ప్రతిపక్షాల వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారయ్యా అంటే, సర్లే, ఇది కూడా రాజకీయంలో ఒక భాగం అని సరిపెట్టుకోవచ్చు. అలాగని ఇది నేరం కాకుండా పోదనుకోండి. అలా కాకుండా ఈ త్రాష్టులు ప్రతిపక్ష రాజకీయ నాయకులతో ఆగకుండా సొంత పార్టీ వారి ఫోన్లను కూడా ట్యాప్ చేయించారు. అక్కడతో ఆగారా... ఆగితే వీళ్ళు మనుషులెలా అవుతారు? సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు.. ముఖ్యంగా ఇంటి ఇల్లాళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ చేయించారు. అక్కడతో ఆగినా వీళ్ళను మనుషుల్లో వున్న పిశాచాలుగా భావించి క్షమించే అవకాశం వుండేది. ఈ నికృష్టులు మరింత అడ్వాన్స్ అయిపోయి సినిమా హీరోయిన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేసి కాపురాల్లో నిప్పులు పోశారు. సమాజంలో ఉన్నత వర్గాల వారి ఫోన్లను ట్యాప్ చేసి, వాళ్ళ వ్యక్తిగత రహస్యాలను తెలుసుకుని, బ్లాక్ మెయిల్‌కి పాల్పడ్డారు. 
ఇవన్నీ ఒక ఎత్తు అయితే, లేటెస్ట్.గా బయటపడ్డ మరో ఘోరం ఇంకో ఎత్తు. మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన తమిళిసై ఫోన్‌ని కూడా ఈ బేవర్సోళ్ళు ట్యాప్ చేశారట. ఆ విషయాన్ని ఆమె తాజాగా బయటపెట్టారు. ఆమె గవర్నర్‌గా వున్న సమయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏమాత్రం ప్రొటోకాల్‌ని పాటించకుండా ఆమెను అనేక అవమానాలకు గురిచేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఇతర ముఖ్య నాయకులు తమిళిసైని ఎంతమాత్రం లెక్కచేయకుండా మాట్లాడేవాళ్ళు. తాచుపాము బుస కొట్టడం చూసి, వానపాము కూడా బుసకొట్టిందట. ఇదే తరహాలో బీఆర్ఎస్‌లోని గల్లీ లీడర్ల లాంటివాళ్ళు కూడా గవర్నర్‌కి వ్యతిరేకంగా మాట్లాడేవారు. ఆ మహాతల్లికి ఓర్పు ఎక్కువ కాబట్టి వీళ్ళ తీరుమీద రాష్ట్రపతికి ఫిర్యాదు చేయకుండా నెట్టుకొచ్చింది. అయితే 2022లోనే ఆమె తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టు ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ఆ ఆరోపణలను ఎంతమాత్రం పట్టించుకోలేదు. ఆ ఆరోపణలను విన్నవారు ఆమె రాజకీయ కోణాలతో ఇలాంటి ఆరోపణ చేసి వుండవచ్చని భావించారు. అయితే ఇటీవలి కాలంలో బయటపడ్డ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని గమనించిన తమిళిసై మరోసారి తన ఫోన్లను ట్యాప్ చేసినట్టు వెల్లడించారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో దర్యాప్తు జరుగుతోంది కాబట్టి, తాను గతంలో చేసిన ఆరోపణలకు బలం చేకూరిందని ఆమె అంటున్నారు.
ఏది ఏమైనప్పటికీ, సాక్షాత్తూ రాష్ట్రపతికి, రాజ్యాంగానికి ప్రతినిధి అయిన గవర్నర్ ఫోన్‌ని ట్యాప్ చేశారంటే, అలా చేసిన వాళ్ళని, అలా చేయడానికి ఆదేశాలు జారీ చేసిన వాళ్ళని పాత చెప్పుని పేడలో ముంచి కొట్టాలి.