ప్రజా ఆరోగ్యాన్ని ప్రభుత్వాలు పాతర వేశాయా ?

ప్రజా ఆరోగ్యాన్ని ప్రభుత్వాలు పాతర వేశాయా ? అన్న ప్రశ్నకు అవుననే అంటున్నారు నిపుణులు. . ఇక వివరాల లోకి వెళితే  కొన్ని సంవత్సరాల క్రితం దాదాపు 19 7౦ - 198౦ లో ప్రజా ఆరోగ్యానికి కీలక అంశం గా పరిగనించారు. ఆ క్రమంలో ప్రజా ఆరోగ్యానికి  గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్రజా ఆరోగ్యంలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు ఇంటి ఇంటికీ వెళ్లి అటు గర్భిణి బాలింత, చూలింత, బిడ్డ ఆరోగ్యానికి  ఆరోగ్య కార్యకర్తలు  ఆరోగ్యం పై అవగాహన
కల్పించడం వారిబాధ్యతగా భావించే వారు. అప్పటికీ ప్రాధమిక స్థాయిలో వచ్చే అనారోగ్యానికి  పాట శాలాలో వ్యాక్సిన్ వేయడానికి కుటుంబ నియంత్రణ వంటి సమస్యలకు డాక్టర్ అవసరం లేకుండానే  ప్రజల ఆరోగ్యానికి సహకారం అందించిన ఆరోగ్య కార్యకర్తల వ్యవస్థ కా ల క్రమేణా  తెరమరుగు అయ్యింది ప్రజా ఆరోగ్య వ్యవస్థని గాడి లో పెట్టాలంటే ఒక వ్యవస్థ ఉండాలన్న ఆలోచన ప్రభుత్వాలు విస్మరించయన్నది వాస్తవం. గ్రామాలు పట్టణాల లో ఆరోగ్యం కొంత మేర 
చక్కబెట్టడానికి ప్రయత్నాలు జరిగాయి ఆక్రమం లో గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వాలు 1౦౦ పడకల ఆసుపత్రి జిల్లా ఆసుపత్రిగా వృద్ధి చేసాయి.
 
ఈ పరిస్థితి ఎలా ఉందంటే జిల్లాలు పట్టణాలు కాస్త పరవాలేదు అనుకున్న గిరిజన వెనక బడ్డ ప్రాంతాలలో ఇప్పటికీ  అక్కడ ఆరోగ్య కేంద్రాలు లేవు కనీసం ఇప్పటికీ ఆయా ప్రాంతాలలో రోగింకి చికిత్చ చేయాలంటే అత్యవసరంగా  అమ్బ్యులేన్స్ కూడా వెళ్ళ లేని స్థితి ఇదే కొన్నిఏ ళ్ళుగా  కొనసాగుతున్న ఆయా వెనుక బడ్డ ప్రాంతాలలో నెగ్గిన శాసన సభ్యులు, పార్ల మెంట్ సభ్యుల  నిధులు అక్కడి పరిస్థితిని చక్క బెట్టలేక పోయాయి. రాజ కీయ పార్టీలు తమ రాజకీయ మ్యానిఫెస్టో లో ఆర్ధిక పద కాల వెల్లువ తప్ప తమ ఆర్ధిక ప్రణాళిక లోనిధులు కేటాయించక పోగా తీవ్ర నిర్లక్ష్యం చేసారు.ఆ నిర్లక్ష్యం  నేటికీ కనపడుతోంది ఆనిర్లక్ష్యానికి ప్రజలు తమ ప్రాణాలు మూల్యం చెల్లించుకుం టున్నారు . ఇప్పటికీ పట్టణ ప్రాంతాలలో ఆధునిక వైద్య సామగ్రి ఇప్పటికీ అందు బాటులో లేకపోవడం మన దౌర్భాగ్యం.ఒక వేళ ఉన్న అవి ఎప్పటికీ పని చేయవు బయటి ఉన్న  ప్రైవేట్  సెంటర్లలో పరీక్షలు, ఎక్స్ రే లు చేయించాలి ఇంకొంచం ముందుకు వెళితే  జిల్లా ఆసుపత్రిలో దొరకని మందులు  దగ్గరలో ఉన్న మందుల దుకాణాలలో దొరుకు తాయి. ఒకప్పుడు జిల్లా ఆసుపత్రికి ధైర్యంగా వెళ్ళిన రోగులు ఇప్పుడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కి వెళ్ళా లంటే తిరిగి వస్తామో లేదో అన్న సందేహం తో  రోగులలో బలంగా మారి పోయింది.

కోవిడ్19 సమయంలో పరిస్థితి పూర్తిగా మారి పోయింది మొదటి విడత  మన ఆరోగ్య సేవల డొల్ల తనాన్ని బయట పెట్టింది. కనీసం అత్యవసర సమయంలో చికిత్చ చేద్దామన్న సరిపడా లేని సర్జరీ సామాగ్రి, ఒకే డాక్టర్ ఇద్దరు నర్సింగ్ సిబ్బంది , పురుడు పోయడానికి కూడా సరిగ్గా లేని లేబర్ రూమ్స్ మందుల కొరత ఇలా ఆన్ని సమస్యలు  ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ఉన్నాయని ఐ ఎం హెచ్ కేంద్రానికి నివేదిక ఇచ్చింది ఈ సమస్య కేవలం ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాదు .మహా రాష్ట్రా,కేరళ, గుజరాత్ తమిళ నాడు ,అస్సాం , కల కత్తా,  ఒడిస్సా రాష్ట్రాలలో సైతం ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల స్థితి నిర్లక్ష్యానికి  అడ్డం పడతాయి .కోవిడ్  తొలి ప్రభావం తో అయినా ప్రజా ఆరోగ్యానికి  ప్రభుత్వాలు పెద్ద పీట వేస్తాయి అని అందరు అనుకున్న ఫర్ ది పీపుల్  బై ది పీపుల్ అన్నవిషయం పూర్తిగా మర్చి పోయి కనీసం ప్రజా ఆరోగ్యం పట్ల కనీసం ఒక్క  ప్రణాళిక సిద్ధం చేయక పోగా ఆరోగ్య కార్యకార్తలు సహకారం తో విజయవంతం అయినప్పటికీ ఆ విజయాని మర్చిపోయాయి ప్రభుత్వాలు. ఆర్ధిక ప్రణాళికలో సైతం పెద్ద కేటాయింపులు చేసామంటూ చెప్పుకున్న ప్రభుత్వాలు రాష్ట్రాలు ఈసారి ఆర్ధికంగా 
పెద్ద  పీట వేశామని చెప్పుకున్నాయి వాటికీ భారీ ప్రచారం కల్పించాయి. 

ప్రపంచ శాస్త్రజ్ఞులు రెండవ విడత ప్రమాదకరమని సాక్షాతూ బ్రిటన్ ప్రధాని బోరిస్  జాన్సన్ హెచ్చరించినా పెద్దగా పట్టించుకోలేదు. అప్పటికైనా  కోరోనా రెండవ విడత తీవ్రతను అంచనా వేయక పోగా కనీసం కోరోనా  ను ఎదుర్కోడానికి అవసర మైన ఏర్పాట్లు చేయక పోగా రానున్న ముప్పు కు తగ్గట్టు ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసిన దాఖ లాలు లేవు , కోరోనా కట్టడికి అవసరమైన వ్యాక్సిన్ ను అందించడంలో ప్రభుత్వాలు చూపిస్తున్న అనాశక్తి  తేట తెల్ల మౌ తోంది. అటు ప్రభుత్వ ఆసుపత్రులు ,ఇటు ప్రై వేటు ఆసుపత్రి లో బెద్స్ ఆక్సిజన్ దొరకక ప్రాణాలు పోతుంటే కోరో నా చుట్టూ ముట్టినా నోట్లు కోట్లు ఓట్లు మత్తులో అధికారం 
కోసం ఎన్నికల్లో మునిగి పోయిన  ప్రజా ప్రభుత్వాలు ప్రాధ మిక స్థాయిలో కనీస అవసరాలు  ఇవ్వాల్సిన బాధ్యతను విస్మరించిన మీకు ప్రజా ఆరోగ్యం కన్నా అధికారమే లక్ష్యమని  మీ చేతలు చెపుతున్నాయి . నన్నుఅంటకు నామాల కాకి అన్న చందాన ప్రజా ఆరోగ్యం మాదికదని అది రాష్ట్ర ప్రరిదిలో ఉన్న అంశ మని చెప్పి తప్పించుకు నే ప్రయత్నం చేయడం చూస్తే ప్రజా ఆరోగ్యం పానులు మాకు సమాస్యలు మీకు అధికారం మాది పెత్తనం మాది మేము అన్నీ ఇస్తున్నాం రాష్ట్రాలు పనిచేయడం లేదతూ ఆరోపణలు చేస్తూ తమ బాధ్యత తీరిపోయింది అన్నట్టుగా ప్రయత్నిస్తుంది. ఇలా  ప్రభుత్వాలు గత ప్రభుత్వాల నిర్వాకమంటూ ఆరోపించే మీకు ప్రభుత్వాలు గతంలో అమలు చేసిన ఆరోగ్య కార్యకర్తల వ్యవస్థ ను ఎందుకు అమలు చేయలేదు? అన్నది ఒక  ప్రశ్న. రాజకీయాలు ఓటు బ్యాంకు పధకాలు పక్కన పెట్టి ప్రజా ఆరోగ్యాన్ని పట్టీ పట్ట నట్టుగా వ్యవహరించడం మాని మీరజకీయలకు ప్రజల ప్రాణాలు పెట్టి ఎన్నికాల్లో గెలవాలన్న పద్దతిని పక్కన పెట్టండి . ప్రజా ఆరోగ్యాన్ని అందించే బాధ్యతను 
చేపదతాయని ఆశిద్దాం. ఈసమస్య అన్నిటికీ కారణం ముందు చూపు లేని ప్రణాళిక వ్యాక్సిన్ పంపిణీ లో ను సంసిద్ధతలేకపోగా వ్యక్సింకు సైతం మీ రాజకీయ కుట్ర కోణాన్ని ఆపాదించడం చూస్తే ప్రజలను చులకనగా చూడడం మానుకోవాలని  వ్యాక్సిన్ లోను కుట్ర రాజకీయాలు మానుకుంటే మంచిది. అని రాజకీయ నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారి ఇప్పటికైనా ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేయకుంటే మరిన్ని మరణాలు ఆపడం కాష్టం. దేశం శవాల దిబ్బగా మారక ముందే మేల్కొండి.సత్వర వ్యాక్సిన్ , మరిన్ని ప్రజా ఆసుపత్రులు , కనీస సౌకర్యాలు అందించే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నారు మీకు ఓటేసిన జనం . ప్రజా విజ్ఞప్తిని 
అమలు చేయండి ప్లీజ్.