గోవాలో ఫారిన్ గర్ల్ మానభంగం
posted on Nov 7, 2014 9:32AM

గోవాలో ఇస్టోనియా దేశానికి చెందిన ఒక యువతి మీద ఒక వ్యక్తి అత్యాచారం చేశాడు. గోవా రాజధాని పనాజీకి 20 కిలోమీటర్ల దూరంలోని చపోరా అనే గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఉత్తర గోవాలో వున్న ఈ గ్రామం నేరాలకు, మాదక ద్రవ్యాలకు, అసాంఘిక కార్యకలాపాలకు నిలయం అని పేరుంది. అత్యాచారానికి గురైన యువతి ఈ గ్రామానికి ఎందుకు వెళ్ళిందో తెలియాల్సి వుంది. అత్యాచారానికి గురైన అంజునా అనే ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. తనమీద అత్యాచారం చేసిన వ్యక్తి తన దగ్గరున్న నగదు దోచుకోవడమే కాకుండా ఈ మానభంగం విషయాన్ని బయటకి వెల్లడిస్తే తన తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడని ఆ యువతి తెలిపింది. ఈ అత్యాచార సంఘటన మీద దర్యాప్తు చేసిన పోలీసులు రేపిస్టు ముంబైకి చెందిన షమీమ్ పేషిమామ్గా గుర్తించారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.