జవాన్ల పిల్లలకు అండగా ఉంటా...


ఛత్తీస్‌గఢ్‌ లో మావోయిస్టులు సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి జరిపి దాదాపు 25 మందిని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక జవాన్లపై దాడిపై స్పందించిన భారత స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మావోయిస్టులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు తన గొప్ప మనసును చాటుకున్నాడు గంభీర్. సీఆర్పీఎఫ్ జవాన్ల పిల్లలకు అండగా తానుంటానని వారి చదువులకు అయ్యే పూర్తి ఖర్చును తాను భరించనున్నట్లు ప్రకటించాడు. దీనికి సంబంధించి మా బృందం ఇప్పటికే పని ఆరంభించిందని..దీనిపై పురోగతిని త్వరలోనే వెల్లడిస్తా' అని గంభీర్ వివరించాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu