పిత్తాశయంలో రాళ్లు ఎందుకు వస్తాయో తెలుసా?
posted on May 3, 2025 9:30AM

ఇంతకు ముందు రోజుల్లో కిడ్నీలో రాళ్లు అనే విషయాన్ని ఎక్కువగా వినేవాళ్లం. కానీ ఇప్పట్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ అని ఎక్కువ వింటూ ఉన్నాం. దీన్నే పిత్తాశయంలో రాళ్లు అని అంటారు. చాలా మంది ఈ మధ్య కాలంలో పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం అనేది చాలా కారణాల వల్ల జరగవచ్చు. కానీ ముఖ్యంగదా ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం. చెడు జీవనశైలి వల్ల పిత్తాశయంలో రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయని చెబుతారు. అయితే అసలు పిత్తాశయంలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి తెలుసుకుంటే..
పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటానికి కారణం పిత్తంలో ఉండే బిలిరుబిలిన్, లవణాలు, మూలకాల అసమతుల్యత. ఇవి అసమతుల్యతగా ఉన్నట్టైతే పిత్తాశయంలో రాళ్లు ఏర్పడతాయి.
పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం అనేది సాధారణంగా ఊబకాయం, అధిక బరువు వంటి సమస్యలు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తాయి. ఊబకాయం ఉన్న వారిలో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఈ అధిక కొలెస్ట్రాల్ పిత్తాశయంలో రాళ్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
మహిళలలో పిత్తాశయంలో రాళ్లు ఏర్పడితే అది హార్మన్లలో మార్పులు, ముఖ్యంగా అధిక ఈస్ట్రోజెన్ స్థాయిల వల్ల జరుగుతుందని అంటున్నారు. వీటి వల్లే పిత్తాశయంలో రాళ్లు ఏర్పడతాయట.
ఆహారంలో ఫైబర్ లేకపోవడం, జీర్ణ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. ఇది పిత్త అసమతుల్యతకు, పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటానికి దారి తీస్తుంది. అందుకే ఆహారంలో ఫైబర్ ను తీసుకోవాలి. అలాగే జీర్ణ సమస్యలు ఏవీ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జీర్ణసమస్యలు వస్తే వెంటనే పరిష్కారం అయ్యేలా చూసుకోవాలి.పోషకాలు అధికంగా ఉన్న, ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...