Home

»

Latest News

‘కన్నప్ప’ ట్రైలర్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ని శాటిస్‌ఫై చేసిందా?

Jun 15, 2025

గత కొంతకాలంగా ఏదో ఒక రకంగా ‘కన్నప్ప’ వార్తల్లో నిలుస్తూనే ఉంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భక్తకన్నప్ప సినిమా గురించి అందరికీ తెలుసు. అయితే అందులో ప్రస్తావించని అంశాలు ఇందులో ఉంటాయని ఈ సినిమాకి రచయితలుగా పనిచేసినవారు చెబుతున్నారు. మరి సినిమాలో ఏం ఉంది అనేది ఆసక్తికరంగా మారింది. పాన్‌ ఇండియా మార్కెట్‌ కోసం వివిధ భాషలకు చెందిన హీరోలను ఇందులో నటింపజేశారు. అంతవరకు బాగానే ఉంది. మరి సినిమా ఎలా ఉండబోతోంది? మంచు విష్ణు ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుందా అనేది చూడాలి. 

జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా ‘కన్నప్ప’ విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను శనివారం విడుదల చేసింది చిత్ర యూనిట్‌. అందరూ ఈ సినిమాలో ప్రభాస్‌ క్యారెక్టర్‌ ఎలా ఉండబోతోంది, ఎంత సేపు ప్రభాస్‌ కనిపిస్తాడు అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్‌ చూపించిన దాన్ని బట్టి ప్రభాస్‌ ఫ్యాన్స్‌ హ్యాపీగా ఫీల్‌ అయ్యే అవకాశం ఉంది. ఇక మిగతా కంటెంట్‌ విషయానికి వస్తే.. ప్రేక్షకులకు క్యూరియాసిటీని కలిగించే అంశాలు సినిమాలో అంతగా ఉన్నట్టుగా కనిపించలేదు. విజువల్‌గా, మ్యూజికల్‌గా చాలా గ్రాండ్‌గా చూపించే ప్రయత్నం చేసినప్పటికీ ఈ తరహాలో వచ్చిన గత సినిమాలతో పోలిస్తే మెరుపులు మెరిపించే సినిమా కాదేమో అనే సందేహం కలుగుతుంది. ట్రైలర్‌ చూసి సినిమా గురించి ఒక అంచనాకు రావడం కంటే జూన్‌ 27 వరకు వేచి చూస్తే ‘కన్నప్ప’ ఏ స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాడు అనేది తెలుస్తుంది.  

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com