ఫ్యుయెల్ స్విచ్ లు ఆఫ్ కావడంవల్లే అహ్మదాబాద్ విమాన ప్రమాదం
posted on Jul 12, 2025 9:54AM

అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి వందల మంది మరణించడానికి కారణం టేకాఫ్ అయిన తరువాత ఇంజిన్లకు ఫ్యుయెల్ సరఫరా చేసే స్విచ్ లు ఆఫ్ కావడమేనని తేలింది. టేకాఫ్ అయిన సెకన్ల వ్యవధిలోనే ఈ స్విచ్ లు ఆగిపోయాయని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేటింగ్ బ్యూరో ఏఏఐబీ తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది.
విమానం టేకాఫ్ అయిన సెకండ్ల వ్యవధిలోనే ఇంధన కంట్రోల్ స్విచ్‌లు ఆగిపోయాయనీ.. వెంటనే అప్రమత్తమైన పైలట్ వాటిని ఎందుకు ఆఫ్ చేశావని మరో పైలట్‌ను ప్రశ్నించాడనీ, దానికి ఆ రెండో పైలట్ తాను ఆఫ్ చేయలేదని సమాధానమిచ్చాడనీ నివేదిక వెల్లడించింది. అలాగే పైలట్ మేడే కాల్ చేశాడనీ, అయితే ఆ కాల్ కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ పైలట్ల నుంచి స్పందన వచ్చేలోపే విమానం కూలిపోయిందని ఆ నివేదిక పేర్కొంది.