ఆ పండ్లు తింటే పడకేయడం ఖాయం
posted on Mar 24, 2012 11:34AM
పండ్ల వ్యాపారుల అత్యాశ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. పచ్చికాయను త్వరగా పండ్లుగా మార్చడానికి కొందరు వ్యాపారులు అనుసరిస్తున్న పద్ధతులు వినియోగదారుల ఆరోగ్యానికి హానికరంగా మారుతున్నాయి. మామిడి, బొప్పాయి, సపోట, అరటి తదితర పండ్లను త్వరితగతిన పక్వానికి తెచ్చేందుకు కార్బెట్ తో పాటు క్రిషాన్ అనే మందును చల్లుతున్నారు. ఈ మందు చల్లడంవల్ల ఆయా కాయలు త్వరితగతిన పక్వానికి వస్తున్నప్పటికీ సహజసిద్ధమైన రుచిని కోల్పోతున్నాయి. అంతేకాక ఇలా మందులు చల్లిన పండ్లను తింటే లివర్ ఇన్ ఫెక్షన్, పేగుల్లో పూతవంటి ప్రమాదకర వ్యాధులు సంక్రమిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఈ మందుల వాడకాన్ని ప్రభుత్వం నిషేధించినప్పటికీ ఆ నిషేధం రాష్ట్రంలో ఎక్కడా అమల కావడం లేదు. వ్యాపారులు తమ స్వార్థంకోసం ఈ మందులను పండ్లపై చల్లి వినియోగదారుల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నారు.