బాయ్‌ఫ్రెండ్‌తో పనిలేదు

 

రియాల్టీ టీవీ స్టార్, మోడల్, హాట్ పోజుల అందగత్తె ఖ్లోయీ కర్దాషియన్ తనకు ఇక బాయ్‌ఫ్రెండ్‌తో ఎంతమాత్రం పనిలేదని, అతని అవసరం కూడా తనకు లేదని స్పష్టంగా చెప్పేసింది. మొన్నటి వరకూ ఫ్రెంచ్ కుర్రాడు మోంతానాతో రాత్రింబగళ్ళు డేటింగ్‌ చేసిన కర్దాషియన్‌కి ఈమధ్య అతనితో చెడినట్టుంది. అందుకే ఇప్పుడీ వైరాగ్యపు మాటలు మాట్లాడుతోంది. తాను భవిష్యత్తులో ఏ బాయ్ ఫ్రెండ్‌నీ దగ్గరకి రానివ్వనని అంటోంది. కర్దాషియన్‌కి ఆల్రెడీ ఓ పెళ్ళి అయి, విడాకుల శుభకార్యం కూడా విజయవంతంగా జరిగిపోయింది. లామర్ ఓడమ్ అనే అంకుల్ని పెళ్ళి చేసుకున్న ఈ హాట్ భామ అతన్నుంచి విడిపోయింది. భర్తనుంచి విడిపోయినప్పటికీ ఇంకా తనకు అధికారికంగా విడాకులు రాలేదు కాబట్టి తాను ఇప్పటికీ వివాహితనేనని సతీసావిత్రి టైపులో సెంటిమెంట్ డైలాగ్స్ చెబుతోంది. భర్త నుంచి విడిపోయిన ఆవేదనలో తాను ఫ్రెంచ్ కుర్రాడు మోంతానాకి దగ్గరయ్యానని, ఇప్పుడు మోంతానా కూడా తనకు దూరం కావడంతో ఇక ఒంటికాయ సొంఠికొమ్ములా ఉండిపోవాలని నిర్ణయించుకున్నానని ఆమె అంటోంది. ఈమె ఎన్ని వగలు పోయినా జనం మాత్రం మళ్ళీ పాత భర్త చెంతకు చేరడానికే ఇలాంటి డైలాగ్స్ కొడుతోందని అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu