ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం
posted on Sep 24, 2025 2:39PM

తెలంగాణలో సంచలన సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికారులపై చర్యలు తీసుకునేందుకు విజిలెన్స్ సిఫార్సు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అప్పట్లో హెచ్‌ఎండీఎ కమీషనర్‌గా కొనసాగిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలపై చర్యలకు విజిలెన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో పెద్ద ఎత్తున మనీ లాండ రింగ్ జరిగినట్లుగా గుర్తించిన అధికారులు ఈ ముగ్గురిని విచారణ చేసి ప్రభుత్వానికి నివేది కను పంపింది. అదేవిధంగా కేటీఆర్ కి సంబంధించిన నివేదికను గవర్నర్ కి సమర్పించారు.
ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ కమిషన్ ఫార్ములా ఈ కార్ రేస్ లోని అధికారు లపై ఒక కీలక నిర్ణయం తీసు కుంది. ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి తో పాటు మాజీ మంత్రి కేటీఆర్ ను కూడా పలుమార్లు విచారణ చేశారు .ఈమేరకు విజిలెన్స్ కమిషన్ ఏసిబి ఇచ్చినా నివేదికపై విచారణ జరిపి ఇద్దరు అధికారులపై ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం నుంచి విజిలెన్స్ కమిషన్ నివేదిక ఏసీబీకి చేరింది. ఇదిలా ఉండగా మరోవైపు ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ కోసం ఏసీబీ అధికారులు గవర్నర్‌కు నివేదిక ఇచ్చారు. కానీ ఇప్పటివరకు గవర్నర్ ఫార్ములా ఈ కార్ రేస్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.