పొన్నవోలుకు ఆ అర్హత లేదు!

ఆంధ్రప్రదేశ్ మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. తనకు అదనపు భద్రత కల్పించాలంటూ పొన్నవోలు దాఖలు చేసుకున్న పిటిషన్ ను కోర్టు తోసి పుచ్చింది.

పొన్నవోలు పిటిషన్ పై గురువారం (ఆగస్టు1)న హైకోర్టులో విచారణ జరిగింది.  ఆ సందర్భంగా హైకోర్టు పోలీసు భద్రతకు పొన్నవోలుకు అర్హత లేదని పేర్కొంది. రాజ్యాంగ, చట్టబద్ధ పదవులు నిర్వహించడం  భద్రతకు అర్హత కాదని స్పష్టం చేసింది.

ఎలాంటి ప్రాణహానీ లేదని సెక్యూరిటీ రివ్యూ కమిటీ కూడా నిర్ధారించిందని హైకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ నివేదికపై ఏమైనా అభ్యంతరాలుంటే సవాల్ చేసుకోవచ్చని పేర్కొన్న హైకోర్టు  ప్రాణహాని ఉందని నిర్ధారణ జరిగి, ప్రభుత్వం భద్రత కల్పిస్తే ఆ ఖర్చు పొన్నవోలే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu