అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
posted on Aug 21, 2025 12:51PM

హైదరాబాద్ లో ఘోర విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మరణించారు. కర్నాటక గుల్బర్గా జిల్లా నుంచి హైదరాబాద్ నగరానికి వలస వచ్చి మియాపూర్ మక్క మహబూబ్ పేటలో నివాసం ఉంటున్న కుటుంబం గురువారం (ఆగస్టు 21) అనుమానాస్పద స్థితిలో తమ నివాసంలోనే మరణించారు.
మృతులను లక్ష్మయ్య, వెంకటమ్మ, అనిల్, కవిత, అప్పు గా గుర్తించారు. వీరిలో అప్పు రెండేళ్ల చిన్నారి కావడం మహా విషాదం. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెండేళ్ల చిన్నారిని హత్య చేసి అనంతరం మిగిలిన నలుగురూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అయితే ఘటనా స్థలంలో ఎటువంటి లేఖా లభించలేదని తెలిపారు.